Dhanush : ధనుష్‌కు టాలీవుడ్ టికెట్ ఖాయమా..?
జూన్ 20న థియేటర్లలో విడుదలైన ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా మూవీ ‘కుబేరా’ ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి స్పందన అందుకుంటోంది.
- By Kavya Krishna Published Date - 05:19 PM, Tue - 24 June 25

Dhanush : జూన్ 20న థియేటర్లలో విడుదలైన ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా మూవీ ‘కుబేరా’ ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి స్పందన అందుకుంటోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుండి అత్యుత్తమ స్పందన వస్తున్నప్పటికీ, తమిళనాట మాత్రం మిశ్రమ స్పందన ఎదురవుతోంది. రిపోర్టుల ప్రకారం, కుబేరా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌కు చేరువగా ఉంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 70% కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక తమిళనాడు నుంచి వచ్చిన కలెక్షన్లు కేవలం 30% మాత్రమే. తమిళనాడులో ఇప్పటి వరకు కుబేరా రూ.14 కోట్ల కలెక్షన్ మాత్రమే రాబట్టింది, ఇది చాలా తక్కువగా భావిస్తున్నారు.
Operation Sindhu : ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 380 మంది భారతీయులు
హైదరాబాద్‌లో జరిగిన ‘కుబేరా’ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ధనుష్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. “కుబేరా సినిమాలో దేవ పాత్రకు ధనుష్ ఒక్కరే సరైన నటుడు. ఈ పాత్రను ధనుష్ మినహా మరెవ్వరూ చేయలేరు” అంటూ పేర్కొన్నారు. చిరంజీవి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సందర్భంగా కొన్ని తమిళ సోషల్ మీడియా యూజర్లు ధనుష్ ను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ధనుష్ అద్భుతంగా నటించినప్పటికీ, తమిళ ప్రేక్షకులు సినిమాను మద్దతివ్వకుండా మిశ్రమ స్పందన చూపడం పట్ల ఇతర ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. కొందరు ధనుష్ ఫ్యాన్స్ అయితే, “ధనుష్ కు కోలీవుడ్ కన్నా టాలీవుడ్ బెటర్” అంటూ ఆయనను తెలుగులో సెటిల్ కావాలంటూ పోస్ట్ చేస్తున్నారు.
ఇది కొత్తది కాదు. గతంలో ధనుష్ నటించిన ‘సార్/వాతి’ చిత్రానికి కూడా తమిళనాట ఓ మాదిరి స్పందన వచ్చినప్పటికీ, తెలుగులో మాత్రం అది బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత ధనుష్ కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు ఫ్యాన్స్ ఆశిస్తున్నది – ధనుష్ టాలీవుడ్‌లోనే ఫోకస్ పెంచాలని. కోలీవుడ్ స్టార్‌లు కూడా ఇప్పటి వరకూ కుబేరా సినిమాను పాజిటివ్‌గా స్పందించకపోవడం, చిరంజీవి వంటి సీనియర్ స్టార్ ధనుష్ నటనను మెచ్చుకోవడం ఫ్యాన్స్‌కు గర్వకారణంగా మారింది. ఇకపై రోజుల్లో కుబేరా కలెక్షన్లు ఎలా ఉంటాయో, ఇది ధనుష్ కెరీర్‌లో ‘రాయన్’ కలెక్షన్స్‌ను దాటి హయ్యెస్ట్ గ్రాసర్ అవుతుందో లేదో చూడాలి.
AP Cabinet : ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.. పెట్టుబడులు, రాజధాని అభివృద్ధిపై దృష్టి