KTR Unstoppable: దబిడిదిబిడే.. బాలయ్య షోకు కేటీఆర్, రామ్ చరణ్!
నందమూరి బాలయ్య బాబు అన్ స్టాబబుల్ షో లో మంత్రి (KTR) కేటీఆర్, రాంచరణ్ సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది.
- By Balu J Published Date - 05:07 PM, Thu - 5 January 23

తెలంగాణలో (Telangana) ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతి రాజకీయ నాయకుడు తనకు తానుగా పాజిటివ్ ఇమేజ్ ఏర్పరచుకోవాలని, ఓటర్లను ఆకర్షించాలని కోరుకుంటాడు. కాబట్టి వీలు కుదిరినప్పుడల్లా టీవీ, OTT చాట్ షోలకు వెళ్తుంటారు. ఇప్పటి వరకు సినిమా తారలకే పరిమితమవుతున్న షోలు రాజకీయ నాయకులకు సైతం అడ్డాగా మారాయి. గత ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ సైతం పలు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వడం మనం చూశాం. తద్వారా ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం గెలిచిన సందర్భాలున్నాయి.
కేటీఆర్ పొలిటికల్ ప్లాన్
ఇటీవల చంద్రబాబు నాయుడు బాలయ్య బాబు OTT చాట్ షో అన్‌స్టాపబుల్ (Unstoppable) లో కనిపించారు. ఈ ఇంటర్వ్యూ చంద్రబాబులోని మరో కోణాన్ని ప్రేక్షకులు చూశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కూడా బాలయ్య బాబు షోలో కనిపించిన ఆశ్చర్యపోనకర్లేదు. తెలంగాణకు ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో కేటీఆర్ ఇమేజ్‌ను మరింత పెంచేందుకు ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది. కేటీఆర్ కు ఇలాంటి వ్యూహాలు కొత్త కాదు. నిజానికి, 2018 ఎన్నికలకు ముందు, ప్రముఖ యాంకర్ సుమకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. మహిళలు, యువ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే బాలయ్య ఈ షోకి సంబంధించి కేటీఆర్ (KTR) ఇంకా డేట్స్ ఇవ్వలేదని వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ షో ఎన్నికల సమయానికి ముందే జరగొచ్చు.
రామ్ చరణ్ కూడా
ఈ షోకు మంత్రి కేటీఆర్ (KTR) తో పాటు రాంచరణ్ కూడా అటెండ్ అయ్యే అవకాశాలున్నాయి. మంత్రి కేటీఆర్, హీరో రాంచరణ్ (Ram Charan) మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. గతంలో చెర్రీ ఆడియో ఫంక్షన్స్ కు కేటీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరైన సందర్భాలున్నాయి. రాంచరణ్ తో నాకు బాండింగ్ ఉందని కేటీఆర్ సైతం పలు సందర్భాల్లో చెప్పారు. బాలయ్య షోలో ప్రభాస్, గోపీచింద్ మాదిరిగా మంత్రి కేటీఆర్, రాంచరణ్ ను ఒకే స్టేజీపై చూడొచ్చు. ఇటీవల జరిగిన షోలో ప్రభాస్ రాంచరణ్ కు కాల్ చేసిన విషయం తెలిసిందే. బాలయ్య చరణ్ ను షో కు ఇన్వైట్ చేయగా.. మీరు పిలిస్తే రాకుండా ఉంటానా అంటూ బదులిచ్చారు.
Also Read: Prabhas Project K: అంచనాలు పెంచేస్తున్న ‘ప్రాజెక్ట్ కే’.. దీపిక లుక్ రివీల్!