KL Rahul : తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్.. ప్రగ్నెంట్ అయిన హీరోయిన్..
- By News Desk Published Date - 08:25 AM, Sat - 9 November 24

KL Rahul : బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి హీరోయిన్ గా, నటిగా పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం క్రికెటర్ కేఎల్ రాహుల్ ని ప్రేమించి డేటింగ్ చేసి గత సంవత్సరం పెళ్లి చేసుకుంది అతియా. పెళ్లి తర్వాత రెగ్యులర్ గా ఇద్దరూ సోషల్ మీడియాలో తమ ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఈ జంట తాము పేరెంట్స్ కాబోతున్నట్టు ఇండైరెక్ట్ గా ప్రకటించారు. త్వరలోనే మా ప్రార్థనలకు అందమైన ప్రతిరూపం రానుంది 2025 లో అని రాసుకొచ్చారు. ఆ పక్కనే చిన్ని పాదాలను వేశారు. దీంతో నటి అతియా శెట్టి ప్రగ్నెంట్ అయిందని తెలుస్తుంది. త్వరలోనే కేఎల్ రాహుల్, అతియా శెట్టి తల్లితండ్రులు కాబోతున్నారు. దీంతో ఈ జంటకు ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : Rajamouli : మహేష్ తర్వాత రాజమౌళి టార్గెట్ ఆ హీరోనేనా..?