Rajamouli : మహేష్ తర్వాత రాజమౌళి టార్గెట్ ఆ హీరోనేనా..?
Rajamouli రాజమౌళి ఒకసారి ఛాన్స్ ఇవ్వగా దాన్ని ఆయన కాదన్నారు. సూర్య తెలుగులో ఏదైనా ఈవెంట్ లో పాల్గొన్న ప్రతిసారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు
- By Ramesh Published Date - 07:56 AM, Sat - 9 November 24

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) RRR తర్వాత మహేష్ తో సినిమా చేస్తున్నాడు. 2025 జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమా గురించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ మొత్తం మార్చేశాడు. హాలీవుడ్ టెక్నిషియన్స్ పనిచేస్తున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక మహేష్ (Mahesh) సినిమా కోసం రాజమౌళి ఎలా లేదన్నా మరో ఐదేళ్లు లాక్ చేసినట్టే. అంటే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందని టాక్. 1000 కోట్ల బడ్జెట్ ప్లానింగ్ లో ఉన్న ఈ సినిమాలో భారీ తారాగణం ఉంటుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా తర్వాత రాజమౌళి కోలీవుడ్ స్టార్ సూర్యతో పనిచేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి..
సూర్య కు ఆల్రెడీ రాజమౌళి ఒకసారి ఛాన్స్ ఇవ్వగా దాన్ని ఆయన కాదన్నారు. సూర్య తెలుగులో ఏదైనా ఈవెంట్ లో పాల్గొన్న ప్రతిసారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు. ఐతే కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి సూర్యని చూసే తాను బాహుబలి లాంటి సినిమా చేయగలిగానని అన్నారు.
సో రాజమౌళి, సూర్య ఈ ఇద్దరి మధ్య ఉన్న సంత్సంబంధాలను చూస్తుంటే రాజమౌళి నెక్స్ట్ సినిమా సూర్యతో చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు. రాజమౌళి చేస్తా అనాలే కానీ సూర్య (Surya) తన డేట్స్ అన్నీ ఇచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పొచ్చు.
Also Read : PrabhasXHombale3movies : ప్రభాస్ తో హోంబలే 3 సినిమాల అగ్రిమెంట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండుగ..!