Kiccha Sudeep : నేను బీజేపీకి ప్రచారం చేయలేదు, అతనికి మాత్రమే చేశాను.. పోలింగ్ రోజు సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు..
పోలింగ్ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
- Author : News Desk
Date : 10-05-2023 - 7:41 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటక(Karnataka)లో నిన్నటి వరకు ఎలక్షన్స్(Elections) క్యాంపెయినింగ్ హోరాహోరీగా సాగింది. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలు సినిమా స్టార్స్ ని కూడా తమ ప్రచారాస్త్రాలుగా వాడుకున్నారు. పలువురు కన్నడ స్టార్స్ కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్(Kiccha Sudeep) కర్ణాటక ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత బసవరాజు బొమ్మై తరపున ప్రచారం చేశారు. నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగగా కేవలం 65.69 శాతం పోలింగ్ తో ముగిసింది.
ఈ పోలింగ్ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
నేడు ఓటు వేసిన అనంతరం కిచ్చ సుదీప్ మాట్లాడుతూ.. నేను స్టార్ కంపెయినర్ గా వెళ్లినంత మాత్రాన ఎవరు ఓట్లు వేయరు. పౌరులుగా ప్రతిఒక్కరు బాధ్యతగా ఓటు వెయ్యాలి. ఓటు వేయడానికి అందరూ ముందుకు రావాలి. నాకు ఎలక్షన్స్ లో పోటీ చేయాలనే ఆలోచన లేదు. నేను ఇంకా నటుడిగానే ఉండలనుకుంటున్నాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే అనుభవం, ఆలోచన లేదు. నేను బసవరాజు బొమ్మైకి మాత్రమే ప్రచారం చేశాను, పార్టీకి కాదు. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశాను. నేను సమాజానికి సందేశాలు ఇవ్వను, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ఓటు ఎంతోమంది భవిష్యత్ ను నిర్దేశిస్తుంది. ఓటు వేయనివాళ్ళు దాని ఫలితాన్ని అనుభవిస్తారు అని వ్యాఖ్యానించారు. పోలింగ్ రోజున సుదీప్ ఇలా మాట్లాడటంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Sudha Murthy Voted: ఓటేసిన సుధామూర్తి, ఓటుహక్కుపై యువతకు సందేశం!