Sudha Murthy Voted: ఓటేసిన సుధామూర్తి, ఓటుహక్కుపై యువతకు సందేశం!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Voting Begins) మొదలైన విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 12:34 PM, Wed - 10 May 23

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Voting Begins) మొదలైన విషయం తెలిసిందే. తమ ఓటును వినియోగించుకునేందుకు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, మంత్రులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సామాన్యుల్లా నిలిచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటక సీఎం బొమ్మై, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తమ కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్ సుధా మూర్తి (Sudha Murthy) తన విలువైన ఓటును సద్వినియోగం చేసుకున్నారు. ఓటు వేసిన అనంతరం మూర్తి యువ ఓటర్లకు ఓటు వేయాలని సందేశం ఇచ్చారు. ’’మేం ముసలివాళ్లమైనా సరే 6 గంటలకు ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చాం. యువ ఓటర్లు మమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం అనేది పవిత్రమైన భాగం’’ అంటూ సందేశం ఇచ్చింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Voting Begins) మొదలైంది. ఓటర్లు ఉదయం 7 నుంచే పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 5,31,33,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Also Read: Rashmika Trolled: ఫ్రైడ్ చికెన్ ను ప్రమోట్ చేసిన రష్మిక, నెటిజన్స్ ట్రోల్లింగ్స్!