Kavya Kalyan Ram: కావ్య కళ్యాణ్ రామ్ క్యూట్ లుక్స్.. వైరల్ పిక్స్!
మసూద సినిమా చూశారా.. అందులో ఓ అమ్మాయి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
- By Balu J Published Date - 03:09 PM, Thu - 24 November 22

మసూద సినిమా చూశారా.. అందులో ఓ అమ్మాయి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో అనుకుంటున్నారా.. అదేనండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమా ‘గంగోత్రి’ సినిమాలో ‘వల్లంకి పిట’ పాటలో నటించింది కదా.. అ అమ్మాయే ఈ అమ్మాయి. ఆ పాట ఎంత ఫేమసో.. పాటలో కనిపించిన చిన్నారి పాప కూడా అంతే ఫేమస్.
తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న ఆ చిన్నారి ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌గా మారిపోయింది కావ్య కళ్యాణ్ రామ్. తాజాగా విడుదలైన మసూద అనే సినిమాలో నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అందాలను ఆరబోస్తోంది కుర్ర హీరోయిన్.