Rs 2500 For Women: మహిళలకు ప్రతినెలా రూ.2,500.. ‘మహాలక్ష్మి’ స్కీం కొత్త అప్‌డేట్
‘‘త్వరలోనే మహాలక్ష్మీ పథకం(Rs 2500 For Women) కింద మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం’’ అని రేవంత్ వెల్లడించారు.
- Author : Pasha
Date : 24-02-2025 - 3:06 IST
Published By : Hashtagu Telugu Desk
Rs 2500 For Women: తెలంగాణ రాష్ట్రంలోని మహిళలంతా ఒక స్కీమ్ అమలు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అదే.. మహాలక్ష్మి పథకం. ఈ స్కీం అమలైతే తమకు ప్రతినెలా రూ.2,500 చొప్పున అందుతాయనే ఆశాభావంతో మహిళలు ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందనే నమ్మకంతో తెలంగాణ మహిళా లోకం ఉంది. ఈ తరుణంలో ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. అదేమిటో తెలుసుకుందాం..
Also Read :Germany Elections: జర్మనీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం.. క్రైస్తవ పార్టీల విజయ దుందుభి
15 నెలలు గడిచిపోయాయి..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అప్పుడే 15 నెలలు గడిచిపోయాయి. అయినా ఇప్పటిదాకా మహాలక్ష్మి పథకం అమలు ఊసే లేదు. ఆ స్కీం అమలుకు అవసరమైన నిధులను సమకూర్చుకునే అంశంపై ప్రస్తుతం రాష్ట్ర సర్కారు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కనీస నిధులు సమకూరగానే, ప్రతినెలా రూ.2,500 చొప్పున మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం అమలు దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. ఈ స్కీంపై గత కొన్ని నెలల్లో పలువురు రాష్ట్ర మంత్రులు పలు రకాల వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవలే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘త్వరలోనే మహాలక్ష్మీ పథకం(Rs 2500 For Women) కింద మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం’’ అని రేవంత్ వెల్లడించారు. దీన్నిబట్టి ఆ పథకం అమలు దిశగా ప్రభుత్వం ప్రణాళిక రెడీ చేస్తోందని స్పష్టమవుతోంది. పరిస్థితులన్నీ కలిసొస్తే మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం వేళ మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read :Marriage For Buffaloes : గేదెల కోసం మహిళ రెండో పెళ్లి.. షాకిచ్చిన అత్తామామలు
ఇప్పటికే ఈ స్కీంలు
ఇప్పటికే తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను పెంచారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ చెక్కులు అందించనున్నారు. అంగన్వాడీలు, సహాయ సంఘాల సభ్యులకు చీరలు అందించనున్నారు.