Rishab Shetty : జై హనుమాన్ లో కాంతారా స్టార్..?
Rishab Shetty ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కథ రిషబ్ కు వినిపించాడని.. ఆయన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని టాక్. అదే జరిగితే మాత్రం జై హనుమాన్ సినిమాకు
- Author : Ramesh
Date : 18-10-2024 - 6:31 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన సినిమా హనుమాన్. ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ చూపించిన తెగువ అందరికీ తెలిసిందే. ఐతే హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ ఉంటుందని ప్రకటించారు. ఐతే జై హనుమాన్ లో నటించే స్టార్ కాస్ట్ పై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతుంది. అసలైతే ప్రశాంత్ వర్మ లిస్ట్ లో చాలామంది పేర్లు వినిపిస్తున్నా కూడా ఎవరు ఫైనల్ అయినట్టు తెలియట్లేదు.
లేటెస్ట్ గా కాంతారా స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) దాదాపు జై హనుమాన్ (Jai Hanuman) లో లీడ్ రోల్ కి కన్ఫర్మ్ అన్నట్టు చెబుతున్నారు. కాంతారా ముందు వరకు రిషబ్ కేవలం ఒక కన్నడ నటుడు మాత్రమే కానీ కాంతారా తో ఆయన నేషనల్ లెవెల్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతేకాదు ఆ సినిమాలో తన నటనకు నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు.
జై హనుమాన్ కథ రిషబ్..
కాంతారా స్టార్ తెలుగు సినిమా చేయాలనే ఉత్సాహం చూపిస్తున్నారు. ఐతే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కథ రిషబ్ కు వినిపించాడని.. ఆయన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని టాక్. అదే జరిగితే మాత్రం జై హనుమాన్ సినిమాకు నేషనల్ లెవెల్ లో మంచి అప్పీల్ ఏర్పడుతుంది.
ఆల్రెడీ హనుమాన్ తో అదరగొట్టిన ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఈసారి జై హనుమాన్ తో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది. ఈలోగా ప్రశాంత్ వర్మ రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. వాటిని పూర్తి చేసి జై హనుమాన్ చేయాల్సి ఉంటుంది.
Also Read : Balakrishna Unstoppable : అన్ స్టాపవుల్ 4 కి మొదటి గెస్ట్ లు వీరేనా..?