Kamal Hassan : ఒక్క సాంగ్ కోసం కమల్ అంత వర్క్ చేశారా..?
Kamal Hassan లోకనాయకుడు కమల్ హాసన్ అంటే భారతీయ సినిమాలో ఒక లెజెండ్ అని గుర్తిస్తారు. 250 సినిమాలకు పైగా చేసిన ఆయన ఎలాంటి పాత్రలో అయినా నటిస్తూ మెప్పిస్తుంటారు.
- By Ramesh Published Date - 12:50 AM, Wed - 27 March 24

Kamal Hassan లోకనాయకుడు కమల్ హాసన్ అంటే భారతీయ సినిమాలో ఒక లెజెండ్ అని గుర్తిస్తారు. 250 సినిమాలకు పైగా చేసిన ఆయన ఎలాంటి పాత్రలో అయినా నటిస్తూ మెప్పిస్తుంటారు. విక్రం ముందు వరకు కెరీర్ లో కాస్త ఇబ్బంది పడ్డ కమల్ హాసన్ విక్రం సూపర్ హిట్ తో సూపర్ ఫాం లోకి వచ్చారు. వరుస సినిమాలతో కమల్ మళ్లీ కెరీర్ ఊపందుకునేలా చేశారు.
అయితే కమల్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ నుంచి సినిమాలు కూడా మొదలు పెట్టారు. శింబు హీరోగా ఒక సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉండగా శివ కార్తికేయ తో మరో సినిమా చేస్తున్నారు. ఇక కమల్ హాసన్ రీసెంట్ గా ఇనిమేల్ అనే వీడియో సాంగ్ కి లిరిక్స్ రాశారు. శృతి హాసన్, లోకేష్ కనగరాజ్ కలిసి నటించిన ఈ వీడియోలో ఒక ప్రేమ జంట దగ్గరైన నాటి నుంచి విడిపోయే వరకు కాన్సెప్ట్ చూపించారు.
అయితే ఈ పాటకు లిరిక్స్ అందించేందుకు కమల్ దాదాపు 10 వెర్షన్స్ రాశారట. ఇందులో ఏది బాగుంది అని అడిగారే తప్ప ఇది వాడుకోండని చెప్పలేదని శృతి హాసన్ చెప్పింది. కమల్ హాసన్ నటుడ్ కాదు మంచి రైటర్ అని తెలిసిందే. ఆయన ఇలా ఒక వీడియో సాంగ్ కోసం 10 వెర్షన్స్ లిరిక్స్ అందించడం నిజంగానే గొప్ప విషయమని చెప్పొచ్చు. ఇది కేవలం కమల్ కు మాత్రమే సాధ్యమయ్యే విషయమని చెప్పొచ్చు.
Also Read : Disha Patani : నిషా ఎక్కిస్తున్న దిశా అందాలు.. గ్లామర్ షోలో ఆమె లెక్కే వేరబ్బా..!