Srinidhi Shetty : KGF బ్యూటీతో నాని జోడి..!
న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani) సినిమాలో కూడా ఛాన్స్ అందుకుందట ఈ అమ్మడు. నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ (Shailesh Kolanu Direction) లో తెరకెక్కబోతున్న హిట్ 3 సినిమాలో
- By Ramesh Published Date - 03:29 PM, Thu - 11 July 24

కె.జి.ఎఫ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేదు. అంత పెద్ద పాన్ ఇండియా హిట్ సినిమా అందుకున్నాక అవకాశాలు రాకుండా ఉన్నాయా అంటే. ఛాన్సులు వచ్చినా వాటికి అది కాదు ఇది కాదు అని సాకులు చెప్పి శ్రీనిధి తప్పించూందట. ఐతే కొందరికి అమ్మడు రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పడం వల్లే ఆమెను కాదనుకున్నారని టాక్. కె.జి.ఎఫ్ తర్వాత విక్రం కోబ్రా లో నటించింది శ్రీనిధి. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.
తెలుగులో అమ్మడికి ఒకటి రెండు ఆఫలు రాగా వాటిని కూడా తిరస్కరించిందని తెలుస్తుంది. ఐతే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న తెలుసు కదా సినిమాలో శ్రీనిధి నటిస్తుందని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani) సినిమాలో కూడా ఛాన్స్ అందుకుందట ఈ అమ్మడు. నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ (Shailesh Kolanu Direction) లో తెరకెక్కబోతున్న హిట్ 3 సినిమాలో శ్రీనిధి ని హీరోయిన్ గా తీసుకున్నారట.
హిట్ సినిమాల సీరీస్ లకు తెలుగులో మణి క్రేజ్ ఉంది. విశ్వక్ సేన్ (Viswak Sen), అడివి శేష్ ఆల్రెడీ రెండు సీరీస్ లలో నటించగా ఇప్పుడు 3వ సీరీస్ లో నాని నటిస్తున్నాడు. ఐతే ఈ సినిమాలకు నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని తెలిసిందే. నాని నిర్మాతగా అందులో హీరోగా కూడా చేయనున్నాడు. కచ్చితంగా శ్రీనిధి (Srinidhi)కి ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.
నాని సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులోకి గ్రాండ్ వెల్కం అన్నట్టే లెక్క.ఐతే ముందు ఏ సినిమా రిలీజైన సోషల్ మీడియాలో శ్రీనిధికి ఉన్న క్రేజ్ కి మంచి పాపులారిటీ దక్కుతుందని చెప్పొచ్చు. శ్రీనిధి సినిమాల మీద కన్నా ఫోటో షూట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందని చెప్పొచ్చు. అందుకే తన ప్రతి ఫోటో షూట్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది అమ్మడు.