Kalki vs Pushpa 2 : కల్కి వాయిదా పడుతుందా..? పుష్ప రాజ్ తో పోటీ సిద్ధమా..?
Kalki vs Pushpa 2 ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలతో సినిమాపై
- Author : Ramesh
Date : 17-03-2024 - 1:01 IST
Published By : Hashtagu Telugu Desk
Kalki vs Pushpa 2 ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలతో సినిమాపై భారీ హైప్ ఏర్పరచుకుంది. కల్కి సినిమా మే 9న రిలీజ్ షెడ్యూల్ చేశారు. అయితే ఏపీలో మే 13న ఎలక్షన్స్ షెడ్యూల్ చేశారు. ఏప్రిల్, మే మొత్తం ఏపీలో ఎన్నికల హడావిడి ఉంటుంది. ఆ టైం లో సినిమా రిలీజ్ చేసినా అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ లేదు.
అందుకే కల్కి సినిమా రిలీజ్ వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే కల్కి పోస్ట్ పోన్ అయితే నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనే కన్ ఫ్యూజన్ మొదలైంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం కల్కి సినిమాను ఆగష్టు 15న రిలీజ్ చేసేలా చూస్తున్నారట. ఆల్రెడీ ఆ రోజు పుష్ప 2 రిలీజ్ లాక్ చేశారు. పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 సినిమాపై భారీ క్రేజ్ ఉంది. పుష్ప 1 సెన్సేషనల్ హిట్ కాగా పుష్ప 2 పై అంతకుమించి అంచనాలు ఉన్నాయి.
కల్కి 2898 AD వర్సెస్ పుష్ప 2 రెండు సినిమాల మధ్య గట్టి ఫైట్ జరగనుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ ఉండబోతుంది. కల్కి వర్సెస్ పుష్ప 2 ఈ ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతుంది. కల్కి తో పాటుగా పుష్ప 2 కి కూడా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ బజ్ ఉంది. మరి ఈ రెండు సినిమాలు ఒకేరోజు వస్తే ఎలా ఉంటుందో చూడాలి.
Also Read : Poonam Kaur : పూనమ్ కౌర్ ‘గురు’ సెటైర్.. మళ్ళీ ఆయనే టార్గెట్..!