Kalki 2898 AD : అమెరికాలో కల్కి క్రేజ్ మామూలుగా లేదు
అమెరికాలోని సెయింట్ లూయిస్‌కి చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ కార్లతో 'కల్కి' సినిమా పేరును ప్రదర్శించారు
- By Sudheer Published Date - 04:42 PM, Wed - 26 June 24

మరికొద్ది గంటల్లో కల్కి థియేటర్స్ లలో సందడి చేయబోతుంది. ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD) సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి సినిమాకు ప్రమోషన్స్ చేయకపోయినా ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదుర్స్ అనిపించడం ఖాయమని అంత భావిస్తున్నారు. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రేపు (జూన్ 27) రిలీజ్ కాబోతుంది. బాహుబలితో వరల్డ్ వైడ్‌గా తన మార్కెట్‌ని పెంచుకున్న ప్రభాస్.. వరల్డ్ వైడ్‌గా మంచి ఫ్యాన్ బేస్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో అమెరికాలో ఉన్న ఫ్యాన్స్ కల్కి రిలీజ్ సందర్బంగా వినూత్న ప్రదర్శన చేసి అభిమానాన్ని చాటుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అమెరికాలోని సెయింట్ లూయిస్‌కి చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ కార్లతో ‘కల్కి’ సినిమా పేరును ప్రదర్శించారు. ఇందులో సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చివరిలో స్టార్ స్టార్ రెబల్ స్టార్ అంటూ ఫ్యాన్స్ ఆకాశమంత అభిమానాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను బాగా ఆకట్టుకుంటుంది. కాగా కార్లతో ఇలాంటి షో చేయడం ఇది మొదటిసారి కాదు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టైంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి ప్రదర్శనే చేసి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే చేసి అభిమానాన్ని చాటుకున్నారు.
ఇదిలా ఉంటె తెలుగు రాష్ట్రాల్లో కల్కి టికెట్స్ ధరలు భారీగా పెంచారు. మొన్నటి వరకు ఏపీ టికెట్ ధరలు చాల తక్కువగా ఉండగా..ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి సర్కార్ కల్కి కి గుడ్ న్యూస్ అందించింది. విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై 75 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో టికెట్‌పై 125 రూపాయలు పెంచేందుకు అనుమతిచ్చింది. అలాగే రోజుకు 5 షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఈ మేరకు హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
Fans….die hard fans 🙏🏻🔥
Kudos to the fans for putting in so much effort and keeping the MADNESS skyrocketing for their Demigod’s arrival ❤️❤️
📍 ST Louis, MO, USA#Kalki2898AD #Prabhas @VyjayanthiFilms @Kalki2898AD @akashraju_ @sivabhupatiraju @bhargavthota9 @itzmeGowtham36… pic.twitter.com/vKy7W3iZyh
— Prathyangira Cinemas (@PrathyangiraUS) June 24, 2024