Kajal : కాజల్ కి అన్యాయం చేస్తున్న టాలీవుడ్..!
Kajal మొన్నటిదాకా ఒక వెలుగు వెలిగిన కాజల్ ఆఫ్టర్ మ్యారేజ్ అసలేమాత్రం ఛాన్స్ లు అందుకోలేని పరిస్థితి ఏర్పరచుకుంది. పెళ్లి వెంటనే పిల్లాడు ఇలా కంప్లీట్ గా ఫ్యామిలీ ఉమెన్ గా
- By Ramesh Published Date - 11:41 PM, Mon - 4 November 24

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మొన్నటిదాకా ఒక వెలుగు వెలిగిన కాజల్ ఆఫ్టర్ మ్యారేజ్ అసలేమాత్రం ఛాన్స్ లు అందుకోలేని పరిస్థితి ఏర్పరచుకుంది. పెళ్లి వెంటనే పిల్లాడు ఇలా కంప్లీట్ గా ఫ్యామిలీ ఉమెన్ గా మారిన కాజల్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నా ఎందుకో ఆమెకు సరైన అవకాశాలు రావట్లేదు. చివరగా సత్యభామ అంటూ ఒక పవర్ ఫుల్ పోలీస్ కథతో వచ్చిన కాజల్ నెక్స్ట్ సినిమాకు సైన్ చేయలేదు.
కథలు నచ్చక అమ్మడు చేయట్లేదా లేదా ఆఫర్లు రావట్లేదా అన్నది తెలియదు కానీ కాజల్ (Kajal Agarwal) ఈమధ్య టాలీవుడ్ లో కనిపించడం మానేసింది. పెళ్లై ఒక బాబు ఉన్నాక సాధారణంగానే మహిళల్లో కొన్ని మార్పులు వస్తాయి. కాజల్ లో కూడా అలాంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఐతే కాజల్ నటన పరంగా తన బెస్ట్ ఇస్తుంది కాబట్టి మంచి పాత్ర ఉంటే ఆమెకు ఇవ్వడంలో తప్పేమి లేదు.
భగవంత్ కేసరి సినిమా..
అలానే లాస్ట్ ఇయర్ బాలకృష్ణ (Balakrishna)తో భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమా చేసింది కాజల్. ఆ సినిమా హిట్టైనా కూడా అమ్మడికి ఒక్క ఆఫర్ రాలేదు. ఐతే తనకు స్టార్ డం తెచ్చిన తెలుగు ఆడియన్స్ తనను ఇప్పుడు రిసీవ్ చేసుకోవట్లేదని బాధపడుతుంది అమ్మడు.
అదీగాక రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అడుగుతుంది కాబట్టి అమ్మడి దాకా అవకాశాలు రావట్లేదు. మరి కాజల్ కెరీర్ ఇక ముగిసినట్టేనా.. మళ్లీ అమ్మడు తెర మీద కనిపించదా లాంటి డిస్కషన్స్ కాజల్ ఫ్యాన్స్ ని బాధ పెట్టేలా చేస్తున్నాయి.