JR. NTR : ఏపీ సీఎం చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు
JR. NTR : నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులలో ఒక ప్రత్యేకమైన భావోద్వేగం ఉంది. బాలకృష్ణ, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు… ఈ ముగ్గురిలో ఎవరి గురించినా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తే అది అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొస్తుంది.
- By Kavya Krishna Published Date - 10:54 AM, Wed - 13 August 25

JR. NTR : నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులలో ఒక ప్రత్యేకమైన భావోద్వేగం ఉంది. బాలకృష్ణ, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు… ఈ ముగ్గురిలో ఎవరి గురించినా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తే అది అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొస్తుంది. ముఖ్యంగా బాబాయ్ – అబ్బాయ్‌లను ఒకే వేదికపై చూడాలని నందమూరి ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. గతంలో సినిమా ఫంక్షన్లలో ఈ ఇద్దరు కలిసిన సందర్భాలు అభిమానులను ఆనందంలో ముంచేశాయి. అయితే ఇటీవలి కాలంలో మాత్రం ఇద్దరూ వేరువేరు దారుల్లో ఉన్నారు. కారణాలు వ్యక్తిగతమైనవే అయినప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం కలయిక కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
మునుపటిలాగే, బాబాయ్ బాలకృష్ణ జన్మదినం సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేస్తే, అది సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంది. ఈ తరహా ట్వీట్‌లు ఫ్యాన్స్‌లో ప్రత్యేక ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. అలాగే, నారా లోకేష్ కానీ, చంద్రబాబు కానీ జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ట్వీట్ చేసినా, ఆ ఉత్సాహం టీడీపీ క్యాడర్‌లో కనిపిస్తుంది.
PM Modi : టారిఫ్ ఉద్రిక్తతల వేళ.. అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ..!
తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కారణం – ఆయన నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ వార్ 2 ఈరోజు రాత్రి ప్రీమియర్స్‌తో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీనికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా స్పందించారు.
ఎన్టీఆర్ ట్వీట్ వెనుక కారణం సినిమా విడుదలకు సంబంధించినదే అయినప్పటికీ, అభిమానుల్లో మాత్రం ఓ ప్రత్యేకమైన ఆనందం కనిపిస్తోంది. టీడీపీ క్యాడర్‌లోనూ ఈ ట్వీట్ పట్ల సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. రాజకీయ, సినీ వర్గాల్లో ఈ ట్వీట్ మరోసారి ‘బాబాయ్- అబ్బాయ్’ కలయికపై చర్చలను తెరపైకి తెచ్చింది.
India-China: అమెరికాకు చైనాతో చెక్ పెట్టనున్న భారత్!