NTR-Neel : ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా నుంచి బయటకొచ్చిన సర్ప్రైజ్..!
NTR-Neel : జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
- By Kavya Krishna Published Date - 12:40 PM, Mon - 1 September 25

NTR-Neel : జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు కొంతకాలంగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ పేరుపై చాలాకాలంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
ఇప్పటివరకూ సోషల్ మీడియా వర్గాల్లో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఈ సినిమాలో హీరోయిన్ అవుతారని వార్తలు వచ్చాయి. అయితే అధికారిక ధృవీకరణ మాత్రం రాలేదు. తాజాగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ఆయన నిర్మాణం వహించిన శివకార్తికేయన్ హీరోగా రూపొందిన ‘మదరాసి’ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్‌ఎస్ నేతలే : బండి సంజయ్
ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ, “మదరాసి కోసం రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినప్పుడు ఆమె కొత్త హీరోయిన్ మాత్రమే. కానీ ఈరోజు ఆమె అప్‌కమింగ్ స్టార్ అయిపోయింది. ప్రస్తుతం ‘కాంతార 2’లో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తోంది. అంతేకాదు యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’లో కూడా ఆమెకు కీలక పాత్ర దక్కింది. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె చాలా కష్టపడింది. మరో నెల రోజుల్లో కాంతార 2 ప్రమోషన్లలో కూడా పాల్గొనబోతోంది” అని వివరించారు.
ఎన్వీ ప్రసాద్ చేసిన ఈ ప్రకటనతో రుక్మిణి వసంత్ జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్’ చిత్రంలో హీరోయిన్‌గా ఖరారైనట్టే స్పష్టమైంది. దీంతో అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. ప్రశాంత్ నీల్ ఇప్పటికే ‘ఉగ్రం’, ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆయన స్టైల్, జూనియర్ ఎన్టీఆర్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే కొత్త రికార్డులు ఖాయమనే భావన ఉంది. అంతేకాక రుక్మిణి వసంత్ లాంటి న్యాచురల్ పెర్ఫార్మర్ హీరోయిన్‌గా చేరడం సినిమాకు అదనపు బలం ఇచ్చింది.
సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవల కర్ణాటకలోని అనేక ప్రదేశాల్లో కీలక షెడ్యూల్‌ను పూర్తిచేశారు. ఈ నెలలో హైదరాబాద్‌లో మరో పెద్ద షెడ్యూల్ ప్రారంభించనున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోందని యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా అభిమానుల దృష్టంతా ‘డ్రాగన్’ మీదే కేంద్రీకృతమై ఉంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Yadagirigutta Temple : యాదగిరిగుట్ట ఆలయానికి విశ్వవ్యాప్త గుర్తింపు..కెనడా ప్రధాని ప్రశంస