Jr NTR About Kalyan Ram: ఎన్టీఆర్‌కు కళ్యాణ్ రామ్ అంటే ఇంత ఇష్టమా.. అన్నను తండ్రితో పోల్చిన తారక్!
మా అన్న గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది మీ అందరికీ తెలుసు. నేను ఎక్కువ ఆయన గురించి మాట్లాడను. ఆయన కూడా నా గురించి ఎక్కువగా మాట్లాడరు.
- By Gopichand Published Date - 08:06 AM, Sat - 5 October 24

Jr NTR About Kalyan Ram: టాలీవుడ్‌లో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ కుటుంబం నుంచి ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆరోజు పండగ వాతవరణమే. తాజాగా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘‘దేవర పార్ట్ 1’’. సెప్టెంబర్ 27న ఈ మూవీ ప్రేక్షకుల ముందు వచ్చి హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. నందమూరి కళ్యాణ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అందుకు తగ్గట్టుగానే కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఈ మూవీ విజయవంతం కావడంతో చిత్రబృందం ఇటీవల ఒక విజయోత్సవ వేడుకను హైదరాబాద్‌లోని ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించింది. కేవలం సినిమాకు పని చేసిన టెక్నిషియన్స్, కొందరు ముఖ్యులు మాత్రమే ఈ వేడకకు హాజరయ్యారు.
అయితే ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ పై (Jr NTR About Kalyan Ram) ఎంత ప్రేమ ఉందో తొలిసారి బయట పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మా అన్న గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది మీ అందరికీ తెలుసు. నేను ఎక్కువ ఆయన గురించి మాట్లాడను. ఆయన కూడా నా గురించి ఎక్కువగా మాట్లాడరు. కానీ నా తండ్రి తర్వాత తండ్రి స్థానంలో నా వెనకాలే నిల్చుని ఆయన ఆశీర్వచనాన్ని నాకు అందిస్తున్నటువంటి కళ్యాణ్ అన్నకి’’ అని కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు. ఎన్టీఆర్ మాటలకి కళ్యాణ్ రామ్ సైతం ఎందుకు ఇప్పుడు ఇది అన్నట్లు లుక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: Rajendra Prasad Daughter: టాలీవుడ్‌లో పెను విషాదం.. రాజేంద్రప్రసాద్ కూతురు కన్నుమూత
నాకు తండ్రి తర్వాత తండ్రి స్థానం ఉంటూ తన ఆశీర్చనం అందిస్తున్నాడు కళ్యాణ్ అన్న – @tarak9999 #JrNTR about his Brother @NANDAMURIKALYAN at Devara Success Meet ! pic.twitter.com/kUHptYCaDQ
— Rajesh Manne (@rajeshmanne1) October 4, 2024
ఇక ఈ సినిమా విషయానికొస్తే ఇప్పటికే రిలీజైన అన్ని భాషల్లో ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకుపోతుంది. దసరా సెలవులు ఉండటంతో ఎన్టీఆర్ దేవరకు కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 405 కోట్లు సాధించినట్లు చిత్రబృందం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటించగా, విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ నటించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, అజయ్, తదితర నటులు కూడా ఈ మూవీలో నటించారు. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగులో దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ మూవీ చేయనుండగా.. బాలీవుడ్‌లో వార్-2లో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ రెండు మూవీల తర్వాత దేవర పార్ట్-2 వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.