Jason Sanjay : వెండితెరకు దళపతి విజయ్ కుమారుడి ఎంట్రీ..
Jason Sanjay : హీరోగా కాకుండా డైరెక్టర్ గా రాణించాలని జాసన్ సంజయ్ కోరిక. ప్రస్తుతం సందీప్ కిషన్ ను హీరోగా పెట్టి ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు
- By Sudheer Published Date - 08:12 PM, Fri - 29 November 24
తమిళ హీరో దళపతి విజయ్(Vijay) కుమారుడు జేసన్ సంజయ్(Jason Sanjay) సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే హీరోగా కాదు. మన తెలుగు నాట పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో..తమిళనాట విజయ్ కి అంతే క్రేజ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. తమిళనాట టాప్ హీరోగా చెలామణి లో ఉన్న విజయ్..ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తున్నాడు.
ఈ క్రమంలో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలను పూర్తి చేయాలనీ భావిస్తున్నాడు. అయితే విజయ్ వీరాభిమానులంతా విజయ్ కొడుకు డెబ్యూ కోసం ఎదురుచూస్తున్నారు. విజయ్ కొడుకు జాసన్ సంజయ్ (Jason Sanjay) ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చూడటానికి అతను చక్కగా హీరోల ఉంటాడు. కాకపోతే హీరోగా కాకుండా డైరెక్టర్ గా రాణించాలని జాసన్ సంజయ్ కోరిక. ప్రస్తుతం సందీప్ కిషన్ ను హీరోగా పెట్టి ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను తాము నిర్మిస్తున్నట్లు లైకా ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసింది. తమన్ సంగీతాన్ని అందించే ఈ సినిమాకు త్వరలోనే పూర్తి తారాగణాన్ని ప్రకటిస్తామని, జనవరి 2025లో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. మరి ఈ మూవీ జాసన్ సంజయ్ కి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.
Read Also : Indiramma House: ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం వారికే.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!