IT Rides : డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్
IT Rides : పుష్ప-2 (Pushpa 2)సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో మేకర్స్ ఇళ్లపై నిన్నటి నుంచి రైడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే
- By Sudheer Published Date - 12:32 PM, Wed - 22 January 25

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఐటీ రైడ్స్ (IT Rides) కాకరేపుతున్నాయి. నిన్నటి నుండి అగ్ర నిర్మాతల ఇళ్లపై , ఆఫీసులపై అలాగే వారి బంధువుల ఇళ్లపై రైడ్స్ కొనసాగిస్తూ వస్తున్నారు. ఈరోజు పుష్ప డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar)ఇంట్లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. పుష్ప-2 (Pushpa 2)సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో మేకర్స్ ఇళ్లపై నిన్నటి నుంచి రైడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ చిత్ర డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు దిల్ రాజు ఇల్లు, కార్యాలయంలోనూ రెండో రోజు రైడ్స్ కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఎనిమిది చోట్ల ఈ సోదాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
APSRTC : ఏపీ ఆర్టీసీకి ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఆదాయం..
శ్రీవేకంటేశ్వర క్రియేషన్స్‌తో మొదలైన ఈ తనిఖీలు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. ఆయా నిర్మాణ సంస్థలు సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా తీస్తోన్నారు. ఇప్పుడు తాజాగా పుష్ప-2 దర్శకుడు సుకుమార్ కూడా ఐటీ రాడార్‌లోకి వెళ్లిపోయారు. ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులు చేపట్టారు. పుష్ప 2 సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ సహా ఆయనకు ఉన్న ఆదాయ వనరుల గురించి ఆరా తీస్తోన్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. సుకుమార్‌ను ఎయిర్‌పోర్ట్‌లోనే పికప్ చేసుకున్నట్లు తెలుస్తుంది.