Chiranjeevi : చిరంజీవి మూవీ లో వెంకీ నిజమా..?
Chiranjeevi : చిరంజీవి, వెంకటేష్‌ల కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. వారి మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో చూడాలి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుష్మిత నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు
- By Sudheer Published Date - 08:00 AM, Mon - 16 June 25

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వస్తున్న ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. నయనతారతో పాటు చిరంజీవి(Chiranjeevi)పై కీలక సన్నివేశాలు రీసెంట్ గా చిత్రీకరించారు. ముఖ్యంగా క్లైమాక్స్ కోసం భారీ సెట్‌ను ఏర్పాటు చేయగా.. ఆ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలిచేలా డైరెక్టర్ అనిల్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలో జరిగే షెడ్యూల్‌లో ఫ్యామిలీ సీన్స్, హాస్య సన్నివేశాలు షూట్ చేయనున్నారు.
Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాకముందే బిఆర్ఎస్ – కాంగ్రెస్ ఫైట్ ..?
ఈ మూవీలో చిరంజీవి పాత్రపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. శివశంకర్ వరప్రసాద్ అనే ఒరిజినల్ పేరుతో, ఓ ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నారని సమాచారం. చిరు తన అభిమానులకు ఇది చక్కటి వినోదానుభవాన్ని ఇస్తుందని పలు ఇంటర్వ్యూల్లో పేర్కొనడంతో, హ్యూమరస్ క్యారెక్టర్‌గానే కనిపించనున్నారన్న ఊహాగానాలు బలపడుతున్నాయి. నయనతార ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, మరో హీరోయిన్ కూడా కనిపించనున్నట్టు వార్తలు ఉన్నాయి. అయితే ఆమె పేరు ఇంకా బయటకు రాలేదు.
Dhanush : ధనుష్ కోరికను పవన్ కళ్యాణ్ తీరుస్తాడా..?
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. చిరంజీవి, వెంకటేష్‌ల కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. వారి మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో చూడాలి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుష్మిత నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడికి ఇది చిరుతో మొదటి సినిమా కావడం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు చిరు నటించిన ‘విశ్వంభర’ మూవీ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.