HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Kalyan Fulfill Dhanushs Wish

Dhanush : ధనుష్ కోరికను పవన్ కళ్యాణ్ తీరుస్తాడా..?

Dhanush : ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 'కుబేర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా అదే విషయాన్ని మరోసారి ధనుష్ వెల్లడించారు.

  • Author : Sudheer Date : 16-06-2025 - 6:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Dhanush
Pawan Dhanush

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన కోలీవుడ్ హీరో ధనుష్‌(Dhanush ) కు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఫ్యాన్‌ బేస్ ఉంది. ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన ఆయన, తన అభిమాన తెలుగు హీరో ఎవరో అనేకసార్లు బయటపెట్టారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘కుబేర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా అదే విషయాన్ని మరోసారి ధనుష్ వెల్లడించారు. “తెలుగులో డైరెక్ట్ చేయాల్సి వస్తే ఎవర్ని చేస్తారు?” అని సుమ అడిగితే ధనుష్ ఏ మాత్రం తడుముకోకుండా “పవన్ కళ్యాణ్ సార్” అని వెంటనే చెప్పారు. దీంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

Mobile While Eating: భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ చూడటం ఆరోగ్యానికి హానికర‌మా!

తమిళంలో నటుడిగానే కాదు, దర్శకుడిగానూ ధనుష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేసిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే చిత్రం కూడా యువతను ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘ఇడ్లీ కడై’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా కథనంతో పాటు దర్శకత్వం పట్ల కూడా ధనుష్ చూపిస్తున్న ఆసక్తి పరిశ్రమలో ప్రత్యేకంగా నిలుస్తోంది.

ధనుష్‌ ప్రస్తుతం నటించిన తాజా చిత్రం కుబేర.. తెలుగు–తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందింది. ఇందులో అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జూన్ 20న మూడు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలన్న ధనుష్ కల మాత్రం రాబోయే రోజుల్లో సాకారమైతే అది అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన క్షణం అవుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dhanush
  • Dhanush Direct Hero
  • Kuberaa movie
  • Kuberaa Movie pre release
  • nagarjuna
  • Pawan Kalyan

Related News

Pawan Praises Modi's Leader

Pawan Health : పవన్ కళ్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన మోడీ !!

"పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యవంతులు, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని పోస్ట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. తీరిక లేని షెడ్యూల్‌లో కూడా తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపినందుకు ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

  • Pawan Kalyan Surgery

    Pawan Kalyan Surgery : పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఇదేనా?

  • Pawan Soundarya

    Pawan-Soundarya : సౌందర్య ను రిజక్ట్ చేసిన పవన్…లేకపోతే ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ !!

  • Og2

    Pawan Kalyan OG 2 : OG 2 కు పవన్ కళ్యాణ్ నిర్మాత ?

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd