Punarnavi Bhupalam: పునర్నివి భూపాలం ప్రెగ్నెంటా?.. ఇంతకీ ఆమె ఏం చెప్పందంటే?
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి గుర్తింపు సాధించిన నటి పునర్నవి భూపాలం.
- By Anshu Published Date - 08:30 PM, Fri - 10 February 23

Punarnavi Bhupalam: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి గుర్తింపు సాధించిన నటి పునర్నవి భూపాలం. మొదటి సినిమాతో కాస్త గుర్తింపును సాధించినా కానీ ఆమెకు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి సినిమా అయితే రాలేదు. దాంతో చిన్న చిన్న సినిమాలు చేసినా అవేవీ పెద్దగా ఆడలేదు. అలాగే వెబ్ సిరీస్ లలో నటించినా కానీ వాటి వల్ల కూడా పునర్నవి భూపాలంకు ఎలాంటి ప్లస్ కాలేదు.
తెలుగులో బిగ్ బాస్ సీజన్3లో అవకాశం పొందిన పునర్నవి భూపాలం.. ఆ రియాల్టీ షో ద్వారా మంచి ఫాలోయింగ్ ను సంపాదించింది. చాలామందికి పునర్నవి క్రష్ గా మారింది. అయితే సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో లండన్ కు వెళ్లిన పునర్నవి.. అక్కడి నుండి తన అప్ డేట్స్ ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంటోంది. కాగా తాజాగా సోషల్ మీడియాలో పునర్నవి పెట్టిన ఓ ఫోటో కొత్త పుకార్లకు కారణమైంది.
నటి పునర్నవి భూపాలం షేర్ చేసిన ఫోటోలో ఆమె పొట్ట భాగం ముందుకు వచ్చినట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. దీంతో అమ్మడు కడుపుతో ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. లండన్ కు వెళ్లిన పునర్నవి భూపాలం.. పెళ్లి చేసుకోకుండానే త్వరలోనే తల్లి కాబోతోందనే వార్త నెట్టింట వైరల్ అయింది. దీంతో ఈ విషయం మీద పునర్నవి స్పందించింది.
దీనిపై స్పందించిన పునర్నవి…. ‘నా గే బెస్టీతో ప్రెగ్నెన్సీ వచ్చిందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఇష్టారీతిన వార్తలు రాసేశారు ఇది నాన్ సెన్స్. గత నెలలో నేను కాస్త సిక్ అయ్యానని చెబితే, ప్రాణాపాయం అని రూమర్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడేమో నేను ప్రెగ్నెంట్ అని రాశారు. సోషల్ మీడియాలో చూసి నమ్మేయకండి. ఏది నిజమో, కాదో తెలుసుకోండి. మీరు రాసే పిచ్చిరాతలు అవతలి మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఆలోచించండి’ అని పోస్ట్ పెట్టింది.