HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Is Pooja Hegde Career Depends On Mahesh Ssmb28

Pooja Hegde: ఒక్క హిట్ కోసం వెయిటింగ్

టాలీవుడ్ బ్యూటీ పూజ హెగ్డే అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయింది. వరుస హిట్లు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటిస్తుంది

  • Author : Praveen Aluthuru Date : 02-05-2023 - 12:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pooja Hegde
New Web Story Copy (63)

Pooja Hegde: టాలీవుడ్ బ్యూటీ పూజ హెగ్డే అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయింది. వరుస హిట్లు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటిస్తుంది. అయితే ఒకప్పుడు అమ్మడు పట్టిందల్లా బంగారమే. కానీ ప్రస్తుతం పూజ హెగ్డే వరుస ప్లాపులతో సతమతమవుతోంది. అల్లు అర్జున్ పూజ హెగ్డే జంటగా నటించిన అల వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో పూజ అందాల ఆరబోత ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కాగా పూజ హెగ్డే చివరి హిట్ సినిమా ఇదే కావడం విశేషం.

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా పూజ హెగ్డే హీరొయిన్ గా నటించిన చిత్రం బీస్ట్. భారీ హైప్ తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతో కోలీవుడ్ లో సక్సెస్ కొట్టాలని భావించిన పూజా పాపకి చేదు అనుభవం ఎదురైంది. టాలీవుడ్ లో ప్రస్తుతం పూజా జాతకం అంతగా బాగున్నట్టు లేదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం దక్కించుకున్న పూజాహెగ్డే రాధేశ్యామ్ లో నటించింది. అయితే ఈ చిత్రం కూడా పూజాకి కలిసి రాలేదు. భారీ తారాగణంతో విడుదలైన ఈ చిత్రం భారీ ప్లాప్ టాక్ ని మూటగట్టుకుంది. ఇక రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళింది. కొరటాల సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక విధమైన బజ్ క్రియేట్ అవుతుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆచార్య సైతం బాక్సాఫీస్ ని ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంపై పూజాహెగ్డే ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాగా సినిమా ప్లాప్ అవ్వడంతో పూజాహెగ్డే ఖాతాలో మరి డిజాస్టర్ చేరింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన కీసి కా భాయ్ కీసి కా జాన్ చిత్రం ప్లాప్ అయింది. దీంతో పూజాహెగ్డే వరుస ప్లాపులతో సతమతమవుతోంది. ఒక్క సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుంది ఈ అమ్మడు.

పూజాహెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం వర్కింగ్ టైటిల్ SSMB 28. అతడు, ఖలేజా తర్వాత ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలున్నాయి. కాగా.. పూజాహెగ్డే ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రంతో అయినా హిట్ ట్రాక్ ఎక్కాలనుకుంటుంది. చూడాలి మరి పూజాహెగ్డే ఆశ నెరవేరుతుందో లేదో.

Read More: Pawan Kalyan: నేను విన్నాను.. నేను చూశాను, అకాల వర్షాలపై పవన్ రియాక్షన్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mahesh babu
  • pooja hegde
  • Pooja On SSMB28
  • SSMB 28
  • Tollywood Cinema Updates
  • Trivikram

Related News

Mahesh Babu Varanasi

హాట్ సమ్మర్ లో వస్తున్న వారణాసి ?

మహేష్ బాబు-రాజమౌళి ప్రాజెక్టుకు సంబంధించి వారణాసి పట్టణంలో వెలిసిన హోర్డింగ్‌లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ హోర్డింగ్‌లపై వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 7, 2027న సినిమా విడుదల కాబోతున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు

  • King 100 Movie

    నాగార్జున 100 మూవీ లో టబు..!

  • Jana Nayagan Hangs In Balance As The Madras High Court

    జన నాయగన్ కు మరో షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

Latest News

  • తెలంగాణ లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం

  • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

  • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

  • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd