HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Is Madhavan Part Of Ssmb29 His Online Activity Makes Fans Curious

SSMB29: ఎస్ఎస్ఎంబీ 29పై బిగ్ అప్డేట్‌.. మహేష్ బాబు తండ్రి పాత్రలో మాధవన్?

అయితే ఈ లుక్ పోస్టర్ల కంటే కూడా నటుడు ఆర్. మాధవన్ సోషల్ మీడియా స్పందన ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రియాంక చోప్రా పోస్టర్‌పై మాధవన్ వెంటనే స్పందించడం, ఆమె లుక్‌ను ప్రశంసించడం సాధారణ విషయమే.

  • Author : Gopichand Date : 13-11-2025 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SSMB29
SSMB29

SSMB29: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ 29’ సినిమా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీ టైటిల్‌ను ఈ శనివారం (నవంబర్ 15) హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ఈవెంట్‌కు ముందు మేకర్స్ ఒక్కొక్కరి లుక్‌ను విడుదల చేస్తూ అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు.

ప్రియాంక చోప్రా ‘మందాకిని’ లుక్ సంచలనం

తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రియాంక చోప్రా ఫస్ట్-లుక్ పోస్టర్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పోస్టర్‌లో ప్రియాంక ‘మందాకిని’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించింది. ఆమె చీరకట్టులో ఉండి, కనిపించ‌ని శత్రువును లక్ష్యంగా చేసుకుని బుల్లెట్లు పేల్చుతున్న దృశ్యం సినిమా కథపై మరింత ఆసక్తిని పెంచింది. రాజమౌళి మార్కు హీరోయిజంతో ప్రియాంక లుక్ ఆకట్టుకుంది.

Also Read: Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌న విష‌యం!

ఆర్. మాధవన్ ఎంట్రీపై ఆసక్తి!

అయితే ఈ లుక్ పోస్టర్ల కంటే కూడా నటుడు ఆర్. మాధవన్ సోషల్ మీడియా స్పందన ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రియాంక చోప్రా పోస్టర్‌పై మాధవన్ వెంటనే స్పందించడం, ఆమె లుక్‌ను ప్రశంసించడం సాధారణ విషయమే. కానీ అంతకుముందు విడుదలైన పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ పోస్టర్‌పై కూడా ఆయన అదే తరహాలో ఉత్సాహంగా కామెంట్ చేయడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఒక సినిమాలో నటిస్తున్న నటీనటులు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడం సహజం. కానీ మాధవన్ ఇలా రెండు కీలక పోస్టర్లపై చురుకుగా స్పందించడంతో నెటిజన్లు ఆయన కూడా ఈ చిత్రంలో భాగమని గట్టిగా నమ్ముతున్నారు.

మహేష్ బాబు తండ్రి పాత్రలో మాధవన్?

గతంలో SSMB29 చిత్రంలో మాధవన్ ఒక కీలక పాత్ర పోషించవచ్చని, ముఖ్యంగా మహేష్ బాబుకు తండ్రి పాత్రలో నటించవచ్చని కొన్ని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ప్రియాంక, పృథ్వీరాజ్ పోస్టర్ల కామెంట్స్ సెక్షన్‌లో ఆయన చురుకైన ఉనికిని చూస్తుంటే ఆయన పాత్ర ఖరారైందనే భావన మరింత బలపడుతోంది. ఈ పాన్ వ‌రల్డ్ మూవీలో మాధవన్ లాంటి బహుముఖ నటుడు ఉంటే అది సినిమా స్థాయిని మరింత పెంచుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సినిమాకు KL నారాయణ శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. మాధవన్ పాత్రపై అధికారిక ప్రకటన కోసం, అలాగే టైటిల్ లాంచ్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ శనివారం రాబోయే టైటిల్ లాంచ్‌లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cine Updates
  • Globetrotter
  • Madhavan
  • mahesh babu
  • priyanka chopra
  • ss rajamouli
  • SSMB29

Related News

Raja Saab Trailer 2.0

రాజా సాబ్ మూవీ నుంచి మ‌రో ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే?!

మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.

  • Viral Pic

    వైరల్ అవుతున్న చరణ్, ధోని, సల్మాన్ ఫోటో ఇదే!

Latest News

  • గోరఖ్‌పుర్‌ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు

  • భారీగా పడిపోయిన షేర్ ధర.. ఆందోళనలో ఇన్వెస్టర్లు

  • కేసీఆర్ ఉద్దేశ్యం అదేనా ? మొత్తం కేటీఆర్ కనుసన్నల్లో ఉండాల్సిందేనా ?

  • యూట్యూబర్ నా అన్వేష్‌కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..

  • జైపూర్ లో పాలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇదేం వెరైటీ !!

Trending News

    • రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?

    • కొత్త సంవ‌త్స‌రం రోజే అమెరికాకు బిగ్ షాక్‌!!

    • ఫిబ్ర‌వరి 1 నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

    • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భార‌త్ జ‌ట్టు 2026 టీ20 ప్రపంచ కప్ గెలవగలదా?

    • కొత్త ఏడాదిలో కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, బీడీ, పాన్ మసాలా ధరలు..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd