Pushpa 2: ఆ ఒక్క ఎపిసోడ్ కోసం రూ. 50 కోట్ల ఖర్చు.. ఈసారి రికార్డు బద్దలు కొట్టడం ఖాయం?
- By Sailaja Reddy Published Date - 01:05 PM, Wed - 28 February 24
టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప2. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇందులో సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఇతర ఇండస్ట్రీలో అభిమానులు కూడా కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. ఊర మాస్ అవతారంలో బన్నీ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూసేందుకు అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. పుష్ప1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతోంది. ఆ తర్వాత పుష్ప 2కు సంబంధించి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా మరో అప్డేట్ షేర్ చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. కానీ ఇప్పటివరకు అంతగా అప్డేట్స్ రాలేదు. కానీ ఈ మూవీ గురించి ఎప్పటికప్పుడు కొత్త రూమర్స్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. కాగా పుష్ప 2 చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అయితే ఈ మూవీకి సంబంధించి ఒక కీలక ఎపిసోడ్ షూట్ చేశారట. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఆ ఎపిసోడ్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. మొత్తం 25 నిమిషాల పాటు ఉండే ఒక్క ఎపిసోడ్ కోసం ఏకంగా రూ. 50 కోట్లు ఖర్చు చేసిందట చిత్ర యూనిట్. సినిమాలో జాతర ఎపిసోడ్ ఉంటుందని దాదాపు అరగంట పాటు వస్తుందని టాక్. ఈ ఎపిసోడ్ లో బన్నీ అర్ధనారీశ్వరుడి గెటప్ లో కనిపిస్తాడట. అలాగే ఇదే జాతరలో ఒక పాట, భారీ ఫైట్ ఉంటుందని టాక్. పుష్ప 2 చిత్రానికి ఈ ఎపిసోడ్ హైలెట్ కానుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ అప్డేట్ బయటకు రావడంతో ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. చిన్న చిన్నగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు వినిపిస్తుండడంతో అభిమానులు మరింత ఎక్సేట్ అవుతూ సినిమాపై అంచనాలను మరింత పెంచుకుంటున్నారు.
Related News
Eesha Rebba : ఎన్టీఆర్ సినిమా హీరోయిన్ అని ఒప్పించి సైడ్ క్యారెక్టర్ ఇచ్చారు.. ఇక్కడ ఎవరు లేరు కాబట్టే..!
Eesha Rebba స్టార్ హీరో సినిమాల్లో కొందరు హీరోయిన్స్ కు అనుకోని ఇబ్బందులు కలుగుతాయి. సినిమాలో సెకండ్ హీరోయిన్ అని చెప్పి తీరా సినిమా రిలీజ్ అయ్యాక