HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >I Live As I Please I Eat As I Please Madhuri The Madman

Bigg Boss : నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా – దివ్వెల మాధురి..!

  • Author : Vamsi Chowdary Korata Date : 15-10-2025 - 12:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bigg Boss 9 Telugu Madhuri
Bigg Boss 9 Telugu Madhuri

దివ్వెల మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టింది మొదలు.. అది అసలు బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో లేదంటే దువ్వాడ బంగ్లా అనుకుంటుందో ఏమో కానీ.. అంతా తనకి ఇష్టం వచ్చినట్టే జరగాలని అంటుంది. అందర్నీ శాసిస్తోంది. ఈమె నోరేసుకుని అందరిపైనా అరుస్తుంది.. ఎవరైనా తిరిగి సమాధానం చెప్తే.. ఏంటి నోరు లేస్తుంది అని నోరేసుకుని పడిపోతుంది.

నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా.. అడ్డు చెప్పారంటే ఊరుకోను అని అంటుంది. ఆ పచ్చళ్ల పాపతో కలిసి.. వాళ్లు ఇలా వీళ్లు ఇలా అంటూ అమ్మలక్క ముచ్చట్లు చెప్పుకుంటూ.. అందరి క్యారెక్టర్ల గురించి దారుణంగా మాట్లాడుతుంది దివ్వెల మాధురి. బిగ్ బాస్ హౌస్‌లో బాండింగ్‌లు పెట్టుకున్నారంటూ అదో ఘోరం పాపం అన్నట్టుగా నోటికొచ్చినట్టు పేలుతుంది దివ్వెల మాధురి.

బిగ్ బాస్ హౌస్‌లో బాండింగ్ పెట్టుకోవడమే తప్పని చెప్తు ఈ మహాపతివ్రత.. రియల్ లైఫ్‌లో పెళ్లై పిల్లలున్న దువ్వాడ శ్రీనుతో ఎఫైర్ పెట్టుకోవడాన్ని ఏమనాలి? అంటూ ఈమెను ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు జనాలు. అసలు ఆమె స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. ఛీ థూ అని అసహ్యించుకుంటున్నారు.

 

ఈరోజు ఎపిసోడ్ ప్రోమో చూస్తే.. దివ్వెల మాధురి ఇంకా దిగజారిపోయి ప్రవర్తిస్తుంది. వాష్ రూం దగ్గర స్టిక్కర్స్ కనిపించడం లేదు అంటూ కంటెంట్ ఇవ్వడం కోసం సంజనతో గొడవ పడింది. అయితే వీళ్లిద్దరూ ముందే గొడవపడదాం అని వాష్ రూం దగ్గర చెప్పుకుని వచ్చి డ్రామా క్రియేట్ చేశారు. సేమ్.. కుళాయిల దగ్గర బిందెలతో కొట్టుకునిచచ్చే బ్యాచ్‌లా.. ఇద్దరూ తెగ తిట్టుకున్నారు. ఆ దివ్వెల మాధురి అయితే.. వామ్మో దండం రా దూతా.. దువ్వాడ శ్రీనివాసూ.. ఎలా భరిస్తున్నావయ్యా అనేట్టుగానే ఉంది ఆమె మాటతీరు.

 

వీళ్లు మామూలు మెంటల్ కాదు.. కంటెంట్ కోసం దారుణంగా చేస్తున్నారంటూ ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది దివ్య. అయితే తిండి విషయంలో తనకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్న దివ్వెల మాధురి.. దోసెల్లో కర్రీ వేసుకుని తిన్నది. దాంతో దివ్యకి మండింది. దోసెల్లో కర్రీ వేసుకుని తింటే.. మరి భోజనంలో ఏమి వేసుకుని తింటారు.. అయినా ఫుడ్ సెక్షన్‌కి నన్ను రెస్పాన్సిబిలిటీగా పెట్టినప్పుడు నన్ను అడగాలి కదా అని మాధురిని అడిగింది దివ్య. దాంతో దువ్వాడ దువ్వెడ చెలరేగిపోయింది. ఏంటి? నాతో గొడవపడాలని చూస్తున్నావా? ఏంటి అని అన్నది. వచ్చినప్పటి నుంచి ఎవరు ఏం అడిగినా కూడా.. సేమ్ డైలాగ్ చెప్తుంది మాధురి. తన పేరు తెలియదని అన్నందుకు.. ఈమె ఏదో పెద్ద ప్రై మినిస్టర్ అన్నట్టుగా ఫీల్ అయిపోయి.. నా పేరు తెలియదా? అంటూ శ్రీజతో గొడవపడింది మాధురి.

 

ఇప్పుడు కర్రీ విషయం గురించి అడిగితే.. అదే తంతు. ‘నాకు ఈ ఫుడ్ మానిటర్ నచ్చలేదు.. మార్చేయండి’ అని ఆర్డర్ వేస్తుంది దివ్వెల మాధురి. అంటే ఈమె చెప్పగానే మార్చేయాలి మరి. అది అసలు బిగ్ బాస్ హౌస్‌నా లేదంటే ఈమె ఇష్టం వచ్చినట్టుగా ఉండటానికి దువ్వాడ వారి హౌస్‌నా?

 

హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న కళ్యాణ్‌ని అయితే అస్సలు లెక్కచేయడం లేదు. ఓసారి కూర్చోండి మాట్లాడదాం అని అంటే.. కూర్చొంటే కానీ మాట్లాడవా? అని అంటూ అతనితో అడ్డంగా వాదనకి దిగింది. వాడు మంచోడు కాబట్టి సరిపోయింది కానీ.. వేరేవాడైతే ఇచ్చిపడేసేవాడు. ఇప్పుడు కూడా.. ఈ గొడవలో కెప్టెన్ కల్పించుకుంటే.. నువ్వెవరూ అడగాడినికి అని అంటోంది దివ్వెల మాధురి.

 

మీతో నాకు పర్సనల్ బాండింగ్ అవసరం లేదు.. ఇది హౌస్‌కి సంబంధించిన విషయం కాబట్టి అడుగుతున్నా అని దివ్య అనడంతో.. నోటికి పనిచెప్పింది దువ్వాడ. ‘నాకు అస్సలు అవసరం లేదమ్మా.. మీ బాండింగ్‌లు నాకెందుకు అంటూ బాదేసుకుంటూ.. మొహం చిరాకుగా పెట్టింది. బాబోయ్ అక్కడ దివ్వెల మాధురిని చూస్తే.. దీన్ని ఎలా భరిస్తున్నావ్ రా శీనివాసూ అని అనకుండా అయితే ఉండరు.

 

కామెంట్లలలో కూడా అదే చర్చ. నాన్నా.. నాన్నా.. నాన్నా అంటూ మేం బాండింగ్‌లకు రాలేదు.. అంటూ ఒళ్లు మొత్తం ఊపేసుకుంటూ.. పరమనీఛంగా ప్రవర్తించింది దివ్వెల మాధురి. దారుణం ఏంటంటే.. ఈమె ఫేస్ చూడగానే జనం భయపడిపోతున్నారు. ఆమెను పంపించిన తరువాతే మళ్లీ బిగ్ బాస్ చూస్తాం అంటూ టీవీలు కట్టేస్తున్నారంటే.. ఈమె ప్రవర్తన నీఛంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bigboss
  • Bigg Boss
  • Bigg Boss 9
  • Divvela Madhuri
  • star maa
  • Star Maa Bigg Boss

Related News

Pwan Father Dies

Bigg Boss Demon Pavan: డెమాన్ పవన్ ఇంట విషాదం..శోకసంద్రంలో రీతూ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రన్నరప్, సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టి టాప్ 3 వరకు దూసుకెళ్లిన డెమాన్ పవన్ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది

  • Divvela Madhuri

    తిరుమలలో దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు తితిదే ఫిర్యాదు

Latest News

  • Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd