Most Beautiful List: మోస్ట్ బ్యూటిఫుల్ జాబితాలో మంచులక్ష్మీ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాబితాలో మంచులక్ష్మీ స్థానం సంపాదించుకుంది.
- By Balu J Published Date - 03:44 PM, Fri - 19 August 22

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాబితాలో మంచులక్ష్మీ స్థానం సంపాదించుకుంది. టాలీవుడ్ నటులు రామ్ చరణ్, విష్ణు మంచులు 100 మంది అత్యంత అందమైన, ముఖాల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇంకా ఈ లిస్టులో బెయోన్స్, టామ్ హార్డీ, షాన్ మెండిస్, సెబాస్టియన్ స్టాన్, టేలర్ స్విఫ్ట్, మహిరా ఖాన్, మానుషి చిల్లర్ లాంటి వాళ్లున్నారు.
రామ్ చరణ్ దక్షిణాది స్టార్‌లలో ఒకడు. తండ్రి మెగాస్టార్ చిరంజీవి వలె నటనతో ఆకట్టుకుంటున్నాడు. రామ్ చరణ్ తొలిసారిగా ‘చిరుత’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాడు. ఆ తర్వాత మగధీర, ధృవ, ఎవడు, రంగస్థలం వంటి కొన్ని గొప్ప సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచు లక్ష్మీ నటిగా, నిర్మాతగా, హోస్ట్‌గా రాణించింది. తెలుగు, తమిళ సినిమాల్లో తనకంటూ పేరు తెచ్చుకుంది.