Bigg Boss 8 : బిగ్ బాస్ 8 లో తెలుగు వర్సెస్ కన్నడ.. వాళ్లని విడగొట్టి సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్..!
Bigg Boss 8 కొంతమంది మాత్రం సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ గా వస్తుంటారు. ఐతే సీరియల్స్ నుంచి ఎక్కువమంది బిగ్ బాస్ కు వస్తుంటారు.
- By Ramesh Published Date - 03:53 PM, Wed - 6 November 24

బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. ఐతే బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా వచ్చిన వారంతా దాదాపు తెలుగు ఆడియన్స్ కు పరిచయం ఉన్న వారే వస్తారు. కొంతమంది మాత్రం సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ గా వస్తుంటారు. ఐతే సీరియల్స్ నుంచి ఎక్కువమంది బిగ్ బాస్ కు వస్తుంటారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో సీరియల్స్ వాళ్లు ఉన్నారు. ఐతే వారంతా కన్నడ (Kannada) వాళ్లు కావడం విశేషం.
సీజన్ 8 (Bigg Boss 8) లో ఉన్న నిఖిల్ (Nikhil), ప్రేరణ, పృధ్వి, యష్మి వీళ్లంతా కూడా కన్నడ వాళ్లే. అయినా కూడా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో సత్తా చాటుతున్నారు. ఐతే వీళ్ల స్ట్రాటజీలు ఆట తీరు చూస్తే కన్నడ వాళ్లు మిగతా తెలుగు కంటెస్టెంట్స్ ని తొక్కేస్తున్నారంటూ ఆడియన్స్ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.
తెలుగు వాళ్లను తొక్కేస్తూ..
బిగ్ బాస్ కి వచ్చాక అది కూడా తెలుగు బిగ్ బాస్ లో వాళ్లు కూడా తెలుగు (Telugu) మాట్లాడుతున్నప్పుడు వాళ్లు కన్నడ అయితే ఏంటి తెలుగు అయితే ఏంటన్నది కొందరి వాదన. ఐతే తెలుగు వాళ్లను తొక్కేస్తూ కన్నడ వాళ్లకే ఎక్కువ స్కోప్ ఇస్తున్నాడన్న చర్చ కూడా నడుస్తుంది. ఐతే బిగ్ బాస్ హౌస్ లో ఏం చేసినా ఎలా చేసినా అదంతా టీ.ఆర్.పి పెంచేందుకే.
సో అక్కడ ఉన్నది ఎవరైనా కన్నడ, తెలుగు లాంటి చర్చలకు ఛాన్స్ ఇవ్వకుండా చేస్తే బెటర్ అంటున్నారు. తెలుగు ప్లేయర్స్ లో గౌతం (Gautham), విష్ణు ప్రియ, అవినాష్, రోహిణి, తేజ, హరితేజ కూడా బాగానే రాణిస్తున్నారు. ఐతే ఏదైనా గొడవ జరిగినప్పుడు మాత్రం కన్నడ బ్యాచ్ అంటూ వాళ్లను ట్రోల్ చేయడం కామన్ అయ్యింది.
Also Read : Delhi : ఢిల్లీకి బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్