Hrithik: హృతిక్ నో అంటే.. యశ్ కు జాక్ పాట్.. 1500 కోట్ల ప్రాజెక్టు.
సైలెంట్ గా వచ్చి పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాకుండా, వరల్డ్ బియర్డ్ ఫేమ్ అయిపోయాడు హీరో యశ్.
- By Nakshatra Published Date - 10:44 PM, Mon - 30 January 23

Hrithik: సైలెంట్ గా వచ్చి పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాకుండా, వరల్డ్ బియర్డ్ ఫేమ్ అయిపోయాడు హీరో యశ్. తాను నటించిన KGF మూవీ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అయితే ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడకపోయినా ప్రస్తుతం యశ్ కి సంబంధించి ఒక వార్త బాగా ట్రెండ్ అవుతోంది. ఓ భారీ ప్రాజెక్టులో ఆయన అడుగుపెట్టే అవకాశాలున్నాయి అని ఇటీవల విడుదల అయిన కొన్ని కథనాలు దీనికి ఆధారంగా మారాయి. ఆ భారీ ప్రాజెక్టుకి సంబంధించిన వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ విషయానికి ఇంత క్రేజ్ ఎందుకంటే.. అది కొత్త ప్రాజెక్టు క్కాడు. భారతీయ సినిమా చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో తెరకెక్కనున్న “రామాయణ” అని అందుకే ఇంత క్రేజ్ అని సినీ వర్గాల టాక్. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర, మధు మంతెనలు దాదాపు రూ. 1500 కోట్ల బడ్జెట్‌తో ఆ చిత్రాన్ని రూపొందించాలని కొన్ని సంవత్సరాల క్రితమే నిర్ణయించచారట. దర్శకుడిగా నితీశ్ తివారి వ్యవహరించనున్న ఆ ప్రాజెక్టు ఇప్పటి వరకైతే పట్టాలెక్కలేదు. కానీ ప్రస్తుత ట్రెండింగ్ వార్తలతో మళ్లీ సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈ ప్రాజెక్టులో రాముడి పాత్రకు “రణ్‌బీర్ కపూర్” మరియు రావణాసురుడి పాత్రకు “హృతిక్ రోషన్” సరిపోతారని భావించిన నిర్మాతలు.. ఇద్దరినీ సంప్రదించారని వార్తలొచ్చాయి. దానిపై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ పేర్లలో హృతిక్ స్థానంలో యశ్ పేరు వచ్చి చేరింది. గత సంవత్సరం విడుదలైన “విక్రమ్ వేద” లో హృతిక్ ప్రతినాయకుడిగా కనిపించారు. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో హృతిక్ రోషన్ పై కొంత నెగెటివ్ టాక్ వచ్చింది. అయితే ఆ పాత్రకు ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నట్టు దానికోసం యశ్ పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే యశ్‌తో కథాచర్చలు జరిపారని, ఓకే అంటే త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కుందని వార్తలు గట్టిగ వినిపిస్తున్నాయి. యశ్ అప్పట్లో “నేనో ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నా. మిమ్మల్ని అలరించేందుకు ఎక్కువగా పనిచేస్తున్నా. అయితే, ఆ వివరాలు ఇప్పుడు చెప్పలేను. ఓపిక పట్టండి” అని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. ఇక ఆ ప్రాజెక్టే “రామాయణ” అని అంతా భావిస్తుండగా.. అది ఎంత వరకు నిజమో అధికారిక ప్రకటన వస్తే గానీ తెలియదు.

Related News

AP Capital : అమరావతి వెలుగుతోంది.! రైల్వే లైన్ షురూ!
అమరావతిని (AP Capital) ఎవరూ చంపలేరు. దాని నిర్మాణం మందికొడిగా సాగుతోందంతే.