Nayanatara: నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల యాడ్ కోసం అన్ని కోట్లు!
- Author : Sailaja Reddy
Date : 17-03-2024 - 12:33 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన నయనతార ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతూ, టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. నయనతార దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అంతే కాదు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే నయనతార కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు. అయితే సరోగసి ద్వారా నేను ద్వారా కవల పిల్లలకు తల్లి అయిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒకవైపు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే మరొకవైపు సినిమాలలో హీరోయిన్గా నటిస్తోంది. కాగా నయనతార ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోంది. హీరోయిన్ గా ఒక్కో సినిమాకు ఐదు కోట్లకు పైగా వసూలు చేస్తోంది. కాగా నయనతారకు డిమాండ్ ఉన్నా… పెద్దగా యాడ్స్ చేయదు. కారణం తెలియదు కానీ నయనతార వ్యాపార ప్రకటనల్లో కనిపించింది తక్కువే. అయితే ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన నయనతార భారీగా వసూలు చేసినట్లు సమాచారం.
టాటా స్కై ప్రమోషనల్ యాడ్ లో నయనతార నటించింది. 50 సెకండ్స్ నిడివి కలిగిన ఈ యాడ్ కి నయనతార ఏకంగా రూ. 5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. స్టార్ హీరోలు కూడా ఈ రేంజ్ లో వసూలు చేయరు. నయనతార అన్ని కోట్లు తీసుకోవడంతో అందరు షాక్ అవుతున్నారు. మరోవైపు నయనతార జవాన్ మూవీతో బాలీవుడ్ లో కూడా హిట్ కొట్టింది. షారుక్ ఖాన్ హీరోగా గత ఏడాది విడుదలైన జవాన్ బ్లాక్ బస్టర్ అందుకుంది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఆమెకు డిమాండ్ ఏర్పడింది.