Harsha Sundaram Master : చాలా కాలం తర్వాత జీరో కట్స్, మ్యూట్స్ తో తెలుగు సినిమా..!
Harsha Sundaram Master ఈమధ్య తెలుగు సినిమాల్లో కామన్ గానే సెన్సార్ కట్స్, మ్యూట్ సీన్స్ వస్తున్నాయి. దర్శకులు ఎంత ప్రయత్నిస్తున్నా సరే కొన్నిసార్లు బోర్డర్ దాటక తప్పట్లేదు. స్టార్ సినిమా అంటే క్లీన్ యు
- By Ramesh Published Date - 11:19 PM, Thu - 22 February 24

Harsha Sundaram Master ఈమధ్య తెలుగు సినిమాల్లో కామన్ గానే సెన్సార్ కట్స్, మ్యూట్ సీన్స్ వస్తున్నాయి. దర్శకులు ఎంత ప్రయత్నిస్తున్నా సరే కొన్నిసార్లు బోర్డర్ దాటక తప్పట్లేదు. స్టార్ సినిమా అంటే క్లీన్ యు ఎంటర్టైనర్ తీయడం చాలా కష్టరమవుతుంది. ఎన్ని కట్స్, ఎన్ని బీప్స్ ఉంటే అంత క్రేజ్ అనేలా చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి టైం లో అసలేమాత్రం కట్స్ లేకుండా మ్యూట్స్ లేకుండా ఒక సినిమా వస్తుంది అంటే ఆశ్చర్యపోవాల్సిందే.
రవితేజ బ్యానర్, గోల్డెన్ మీడియా బ్యానర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా సుందరం మాస్టార్. కళ్యాణ్ సంతోష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సెన్సార్ నుంచి యు సర్టిఫికెట్ అందుకుంది. అంతేకాదు సినిమా లో ఎక్కడ కట్స్ గానీ మ్యూట్స్ కానీ లేవట.
ఈమధ్య కాలంలో ఇలా క్లీన్ ఎంటర్టైనర్ సినిమా వచ్చి చాలా కాలమైంది. అంతేకాదు ఈ సినిమా 2 గంటల రన్ టైం తో వస్తుందని తెలుస్తుంది. వైవా హర్ష అదేనండి హర్ష చెముడు లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో దివ్యా శ్రీపాద హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను రవితేజ, సుధీర్ కుమార్ కుర్ర కలిసి నిర్మించారు.
Also Read : Mahesh Babu : మహేష్ ఈ 3 నెలలు బిజీ బిజీ.. రాజమౌళి సినిమా స్టార్ట్ ఎప్పుడంటే..?