Harish Shankar : ఆకలి తీర్చిన అన్నయ్యకి బర్త్డే విషెస్.. ఎమోషనల్ ట్వీట్ చేసిన హరీష్ శంకర్!
రవితేజ కి డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) వీరాభిమాని. రవితేజని హరిశంకర్ ఏ స్థాయిలో ప్రేమిస్తాడో, పూజిస్తాడో చాలా సందర్భాలలో తనే చెప్తూ వచ్చాడు హరి శంకర్.
- Author : Vamsi Chowdary Korata
Date : 27-01-2024 - 12:20 IST
Published By : Hashtagu Telugu Desk
Harish Shankar : జనవరి 26 మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఎందరో అభిమానులు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇండస్ట్రీలోనే రవితేజ కి చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన ఎనర్జీకి రాజమౌళి సైతం ఫిదా అయిపోయాడు. అలాంటి రవితేజ కి డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) వీరాభిమాని. రవితేజని హరిశంకర్ ఏ స్థాయిలో ప్రేమిస్తాడో, పూజిస్తాడో చాలా సందర్భాలలో తనే చెప్తూ వచ్చాడు హరి శంకర్.
We’re now on WhatsApp. Click to Join.
రవితేజ తన సినిమా ప్రస్తానానికి మూలవిరాట్ తను లేకపోతే నా జీవితం లేదు అని పలు సందర్భాలలో హరీష్ శంకర్ (Harish Shankar) చెప్తూ వచ్చారు. అయితే ఈరోజు మాస్ మహారాజా బర్త్డే సందర్భంగా రవితేజ పై ఉన్న ప్రేమని సోషల్ మీడియా ద్వారా మరొకసారి చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. మాస్ రాజా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. అన్నయ్య.. నా ఆకలి తీర్చావు.. నా ఆనందాన్ని పంచుకున్నావు. నా ఆవేశాన్ని అర్థం చేసుకున్నావు నా ఆశలకి ఆయువు పోసావు ఇలా నేను ఎంత చెప్పినా, ఏమి చేసినా తక్కువే.
నాకు ఎన్నో జన్మలకు సరిపడేలా ఊపిరి పోసిన నీకు జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. లవ్ యు ఫరెవర్ అంటూ హరీష్ చేసిన ఎమోషనల్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హరీష్ శంకర్ ఇంతలా ఎమోషనల్ అవుతున్నారు అంటే అందుకు కారణం హరీష్ శంకర్ కి ఫస్ట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చిన నటుడు రవితేజ. రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసే హరీష్ శంకర్ కి డైరెక్టర్ గా మార్చి షాక్ అనే సినిమా ద్వారా అతనికి లైఫ్ ఇచ్చాడు రవితేజ.
అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మరొక సినిమా మిరపకాయ్. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది. అంతేకాదు ఈ సినిమాతోనే రవితేజ మాస్ మహారాజా ట్యాగ్ తగిలించుకున్నారు. ఇక ఆ తర్వాత మళ్లీ 12 ఏళ్లకు ఇప్పుడు మూడోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తుంది. సినిమా పేరు మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా జీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల సహనిర్మాత గా వ్యవహరిస్తున్నారు.
Also Read: Nithin : రాబిన్ హుడ్ గా మనం ముందుకు రాబోతున్న నితిన్.. దొంగగా కనిపించబోతున్న హీరో!