Teja Sajja : హనుమాన్ హీరో పర్ఫెక్ట్ ప్లానింగ్..!
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజా సజ్జా నెక్స్ట్ మిరాయ్ తో మరో సూపర్ స్టోరీ టెల్లర్ తో రాబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా
- By Ramesh Published Date - 10:35 AM, Sat - 24 August 24

చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించి హీరోగా మారిన వారిలో తేజా సజ్జా (Teja Sajja) ఒకరు. ఐతే అందరిలా చైల్డ్ ఆర్టిస్ట్ (Child Artist)గా చేశాం కదా ఏదో హీరోగా సినిమాలు చేసేద్దాం అన్నట్టు కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ కెరీ పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ ఇయర్ మొదట్లో హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజా సజ్జా నెక్స్ట్ మిరాయ్ (Mirai) తో మరో సూపర్ స్టోరీ టెల్లర్ తో రాబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా (PAN India) లెవెల్ లో రాబోతుంది.
ఐతే హనుమాన్ సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ అందుకున్నాక తేజా సజ్జాకి విపరీతమైన అవకాశాలు వచ్చాయట. నిర్మాతలు అడ్వాన్స్ పట్టుకుని మరీ వచ్చేశారట. కానీ ఇక్కడే తేజా సజ్జా తెలివి ప్రదర్శించాడు. నిర్మాత దగ్గర డబ్బులు తీసుకుంటే ప్రాజెక్ట్ మాక్సిమం లాక్ అయినట్టే. ఆ టైం లో హీరో డేట్స్ ఉన్నాయ్ కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడానికి ముందుకొస్తారు.
అలా కాకుండా నిర్మాతల దగ్గర నుంచి ఎలాంటి అడ్వాన్స్ తీసుకోకపోతే నచ్చిన కథను నచ్చిన టైం లో చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ లాజిక్ తేజా స్వయానా తెలుసుకున్నాడా లేదా ఎవరైనా చెప్పారా అన్నది తెలియదు కానీ తేజా సజ్జా కు నిర్మాతలు అడ్వాన్స్ లు ఇస్తామన్నా సరే నో అనేస్తున్నాడట.
ఈ కాలంలో కెరీర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమో వచ్చిన సినిమాలు చేసుకుంటూ పోదామనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. అసలు నిర్మాత అడ్వాన్స్ ఇస్తానంటే వద్దనే ఛాన్స్ ఉండదు. కానీ తేజా సజ్జా మాత్రం కథ నచ్చితేనే సినిమా.. అది కూడా ఒక సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశాకే మరో సినిమా అనేస్తున్నాడు. కుర్రాడి పర్ఫెక్ట్ ప్లానింగ్ చూసి సూపర్ అనేస్తున్నారు ఆడియన్స్.
Also Read : Mahesh : మహేష్ రాజమౌళి సినిమాకు కొత్త టైటిల్..?