Mahesh : మహేష్ రాజమౌళి సినిమాకు కొత్త టైటిల్..?
సినిమాను భారీగా లాంచ్ చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా
- By Ramesh Published Date - 10:21 AM, Sat - 24 August 24

సూపర్ స్టార్ మహేష్ (Mahesh) నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేస్తాడని తెలిసిందే. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో కె ఎల్ నారాయణ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమాను భారీగా లాంచ్ చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా ఇది వస్తుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో మహేష్ ని ఇప్పటివరకు చూడని లుక్ తో చూపిస్తారని తెలుస్తుంది. RRR తో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ తో పాటు హాలీవుడ్ డైరెక్టర్స్ ని కూడా మెస్మరైజ్ చేసిన రాజమౌళి ఈ సినిమాతో అంతకుమించి అనిపించేలా చేస్తున్నాడు. ఐతే ఈ సినిమాకు టైటిల్ గా గోల్డ్ అని పెట్టబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. గోల్డ్ టైటిల్ తో బంగారం లాంటి మహేష్ తో ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టాలని రాజమౌళి ఫిక్స్ అయ్యాడు.
Also Read : Ormax Media Top 10 Actors : టాప్ 1 ప్రభాస్.. ఆర్మాక్స్ టాప్ 10 స్టార్స్ లో ఐదుగురు తెలుగు స్టార్స్..!
ఐతే ఇప్పుడు ఈ సినిమాకు మరో టైటిల్ కూడా రాజమౌళి (Rajamouli) ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రాజమౌళి అప్పట్లో తన మనసులో గరుడ (Garuda) అనే సినిమా చేయాలని ఉందని ఒక ఈవెంట్ లో చెప్పాడు. ఐతే అది మహేష్ సినిమానే అంటున్నారు కొందరు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఖుషి అవుతున్నారు.
మహేష్ 29వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై ప్రతి న్యూస్ వైరల్ అవుతుంది. మహేష్ తో రాజమౌళి చేసే అద్భుతాన్ని చూసేందుకు ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.