Hansika Motwani : దేశముదురు హీరోయిన్ బిగ్ షాక్..జైపూర్ కోటలో ఘనంగా వివాహం..!!
హన్సిక...టాలీవుడ్ దేశముదురు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ ఎన్నో హిట్ మూవీస్ లో నటించింది.
- By hashtagu Published Date - 09:14 AM, Mon - 17 October 22
హన్సిక…టాలీవుడ్ దేశముదురు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ ఎన్నో హిట్ మూవీస్ లో నటించింది. అయితే హన్సిక ఇప్పుడు అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది. త్వరలోనే హన్సిక పెళ్లికి రెడీ అయినట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా షురూ అయ్యాయట. డిసెంబర్ లో జైపూర్ లోని ఓ ప్యాలెస్ లో హన్సిక వివాహం ఘనంగా జరగునుందట. 450ఏళ్ల కాలం నాటి ఈ ప్యాలెస్ లో అతిథుల కోసం గదులు ముందుగానే బుక్ చేశారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ప్రారంభం అయ్యాయి. మండోట ప్యాలెస్ ను హన్సిక తన మ్యారేజ్ కోసం అద్దెకు తీసుకుందని బాలీవుడ్ మీడియా వెల్లడించింది.
అయితే డిసెంబర్ లో ఏ తేదీ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. అబ్బాయి ఎవరనేదే కదా మీ డౌట్. హన్సిక తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంటుందట. అయితే ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరనేది స్పష్టంగా తెలియదు. మొత్తానికి హన్సిక లవ్ మ్యారేజ్ చేసుకుంటుందని సన్నిహితులు అంటున్నారు. గతంలో శింబుతో డేటింగ్ చేసింది ఈ అమ్మడు. టాలీవుడ్ లో ఫెడ్ అవుట్ అయ్యాక తమిళంలో మంచి ఛాన్స్ లే వచ్చాయి. అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. శింబుతో బ్రేకప్ చెప్పాక..బాలీవుడ్ సైడ్ వెళ్లింది. మొత్తానికి 31 ఏళ్ల వయస్సులో హన్సిక వివాహం చేసుకోబోతోంది. వివాహం తర్వాత సినిమాలు చేస్తుందా? గుడ్ బై చెబుతా? అనేది సస్పెన్స్.
Related News
Tollywood: పెరుగుతున్న నిర్మాణ వ్యయం.. ఆందోళనలో టాలీవుడ్ నిర్మాతలు
Tollywood: తెలుగు సినిమా కొత్త శిఖరాలను అధిరోహించి, భారతీయ సినిమాలో అనేక అడ్డంకులను అధిగమించింది. నాన్ థియేట్రికల్ రైట్స్ భారీగా పెరగడంతో పాటు థియేట్రికల్ డీల్స్ కూడా భారీగా పెరిగాయి. మన స్టార్ హీరోలు కూడా తమ పారితోషికాన్ని పెంచి తమ మార్కెట్, సక్సెస్ తో సంబంధం లేకుండా పెద్ద డిమాండ్ చేస్తున్నారు. హఠాత్తుగా తెలుగు సినిమాల హిందీ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ తగ్గిపో�