Hansika and Sohail: జైపూర్ లో ఒక్కటైన హన్సిక, సొహైల్ ప్రేమజంట..
సినీ నటి హన్సిక వివాహం ఘనంగా జరిగింది. తన ప్రియుడు, బిజినెస్ పార్ట్నర్ సొహైల్ ను ఆమె పెళ్లాడారు.
- By Maheswara Rao Nadella Published Date - 11:58 AM, Mon - 5 December 22

సినీ నటి హన్సిక వివాహం ఘనంగా జరిగింది. తన ప్రియుడు, బిజినెస్ పార్ట్నర్ సొహైల్ ను ఆమె పెళ్లాడారు. జైపూర్ లోని ఒక రాజ కోటలో వీరి వివాహం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. సింధి సాంప్రదాయంలో పెళ్లిని నిర్వహించారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. హన్సికకు ఇది తొలి వివాహం కాగా, సొహైల్ కు రెండో వివాహం. హన్సిక స్నేహితురాలితో ఆయనకు తొలి వివాహం అయింది. కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. ఆ తర్వాత హన్సిక, సొహైల్ మధ్య ప్రేమాయణం మొదలయింది. తెలుగు, తమిళంలో హన్సిక ఎక్కువ సినిమాలు చేశారు. ఇటీవలే ఆమె 50వ సినిమా విడుదలయింది. మరోవైపు, వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.