Guntur Kaaram : గుంటూరు కారం లేటెస్ట్ అప్డేట్..
తాజా షెడ్యూల్ కేరళలో మొదలవ్వాల్సి ఉండగా..ప్రస్తుతం అక్కడ వాతావరణం అంత బాగా లేకపోవడం తో షెడ్యూల్ లో మార్పులు చేసారు
- By Sudheer Published Date - 01:34 PM, Sat - 9 December 23

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) – ధమాకా బ్యూటీ శ్రీలీల (Sreeleela) జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం (Guntur Kaaram). అతడు , ఖలేజా చిత్రాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా కావడం తో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్.
We’re now on WhatsApp. Click to Join.
గత కొద్దీ నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటు వస్తున్న ఈ మూవీ తాలుకా తాజా షెడ్యూల్ కేరళలో మొదలవ్వాల్సి ఉండగా..ప్రస్తుతం అక్కడ వాతావరణం అంత బాగా లేకపోవడం తో షెడ్యూల్ లో మార్పులు చేసారు. కేరళలో సాంగ్ షూట్ చేయాలనీ అనుకున్నప్పటికీ..ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఆ సాంగ్ షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు. రేపటి నుండి ఫిలిం సిటీ లో సాంగ్ షూట్ చేయనున్నారు. హారిక హాసిని బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, హీరోయిన్‌లుగా, జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 13 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని ప్లాన్.
Read Also : Sonia Gandhi Birthday : సోనియమ్మ బర్త్ డే వేళ.. తెలంగాణకు రెండు గిఫ్ట్స్