HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Good News For Superstar Fans Mosagallaku Mosagadu Is Re Released

Mosagallaku Mosagadu: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్

''పద్మాలయ సంస్థకు పునాది మోసగాళ్లకు మోసగాడు (Mosagallaku Mosagadu) చిత్రం. ఎన్నోవిజయవంతమైన చిత్రాలు తీసినప్పటికీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం మోసగాళ్లకు మోసగాడు.

  • Author : Balu J Date : 01-05-2023 - 6:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mosagallaku Mosagadu
Good News For Superstar Fans, 'mosagallaku Mosagadu' Is Re Released

Mosagallaku Mosagadu Re-Release : ”పద్మాలయ సంస్థకు పునాది మోసగాళ్లకు మోసగాడు చిత్రం. ఎన్నోవిజయవంతమైన చిత్రాలు తీసినప్పటికీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం మోసగాళ్లకు మోసగాడు. అభిమానులు కోరిక మేరకు కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మే 31న మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని అన్ని హంగులతో 4కే లో మళ్ళీ విడుదల చేస్తున్నాం” అని తెలియజేశారు ప్రముఖ నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణగారి సోదరులు ఆదిశేషగిరి రావు. ఈ మేరకు విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత అశ్విని దత్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు బి. గోపాల్, రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.

ప్రెస్ మీట్ లో నిర్మాత ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. మోసగాళ్లకు మోసగాడు (Mosagallaku Mosagadu) చిత్ర నిర్మాణంతోనే పద్మాలయ సంస్థ పునాదులు బలంగా నిర్మించబడ్డాయి. ఆ రోజుల్లో ఈ సినిమా తీయడానికి మాకు స్ఫూర్తి రామారావు గారు. ఆయన ఎన్ఏటీ ద్వారా ఎన్నో విజయవంతమైన మంచి చిత్రాలు తీశారు. మనం కూడా సంస్థ స్థాపించి చిత్రాలు తీయాలనే కోరికతో స్థాపించబడిన సంస్థ పద్మాలయ. మోసగాళ్లకు మోసగాడు తర్వాత పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు.. చిత్రాలు జూబ్లీలు ఆడాయి. కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మే 31న మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని మళ్ళీ విడుదల చేస్తున్నాం.

కృష్ణ గారి ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నప్పటికీ మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని ఎంచుకోవానికి కారణం కృష్ణ గారి అభిమానులు. కృష్ణ గారి అభిమానులందరూ ఈ చిత్రాన్ని మళ్ళీ థియేటర్ లో విడుదల చేయమని కోరారు. అభిమానులు కోరిక మేకరకు కృష్ణ గారికి ఘనమైన నివాళిగా ఈ చిత్రాన్ని మళ్ళీ విడుదల చేస్తున్నాం. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు అన్ని హంగులతో 4కేలో విడుదల చేస్తున్నాం. మోసగాళ్లకు మోసగాడు కౌ బాయ్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్. దర్శకుడు కేఎస్ఆర్ దాస్ గారు, డీవోపీ వీఎస్ఆర్ స్వామీ గారు, రచయిత ఆరుద్ర గారు, సంగీత దర్శకులు ఆదినారాయణ గారు .. ఇలా అందరూ అద్భుతమైన పనితీరు కనబరిచారు. అలాగే ఆ చిత్రంలో భాగమైన అందరినీ ఈ రోజు గుర్తు చేసుకోవాలి. మేము ఎన్ని సినిమాలు తీసినా అన్నిటికి మూలం మోసగాళ్లకు మోసగాడు. ఈ రోజే ఈ కార్యక్రమం పెట్టడానికి ఒక కారణం వుంది. మా బ్యానర్ లో వచ్చిన, కృష్ణ గారి కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రం అల్లూరి సీతారామరాజు విడుదలై నేటి 49 ఏళ్ళు అవుతుంది. వచ్చే యేడాది 50 ఏళ్ళు పూర్తి అవుతుంది.” అన్నారు.

అశ్వినీదత్ మాట్లాడుతూ.. రామారావు గారు, కృష్ణ గారు నిజమైన సోదరులు. ఒక పక్క అన్నగారి శత జయంతి ఉత్సవాలు జరుగుతుంటే మరో పక్క కృష్ణ గారి గురించి కలుసుకోవడం మహా అదృష్టంగా భావిస్తున్నాను. మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని డిగ్రీ చదువుకున్న రోజుల్లో చూశాను. పద్మాలయ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. బాలీవుడ్ లో కూడా ఒక ఒరవడి సృష్టించిన సంస్థ పద్మాలయ. కృష్ణగారి ప్రతి సినిమా అద్భుతమే. కృష్ణ గారి నటులు మళ్ళీ రారు. మోసగాళ్లకు మోసగాడుతో ఎప్పుడో పాన్ వరల్డ్ సినిమా తీశారు. అలాంటి సంస్థ నుంచి మరెన్నో గొప్ప సినిమాలు రావాలి, మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూనే వుండాలి’’ అని కోరారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ… పద్మాలయ సంస్థ స్థాపించి మొట్టమొదటి కౌ బాయ్ చిత్రం కృష్ణ గారు నిర్మించారు. అదే మోసగాళ్లకు మోసగాడు. దాదాపు 52 ఏళ్ళు పూర్తయింది. అభిమానులు అందరూ మళ్ళీ సినిమాని విడుదల చేయాలని కోరితే దిన్ని నేటి టెక్నాలజీ 4కే కి మార్చి విడుదల చేస్తున్నాం. మోసగాళ్లకు మోసగాడు పాన్ వరల్డ్ సినిమా. అన్ని భాషల్లో విడుదలైయింది. అలాంటి కౌ బాయ్ సినిమాని మళ్ళీ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని తెస్తున్నాం’’ అన్నారు బి గోపాల్ మాట్లాడుతూ.. కృష్ణ గారు బంగారు కొండ. డైనమిక్ డాషింగ్ హీరో. ప్రయోగాలకు మారు పేరు. మోసగాళ్లకు మోసగాడు అద్భుతమైన సినిమా. కాలేజీ రోజుల్లో ఎన్ని సార్లు చూశాను. మోసగాళ్లకు మోసగాడు ట్రెండ్ సెట్టర్. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తారు. పెద్ద విజయం చేస్తారు’’ అని చెప్పారు.

రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని ఇంటర్ లో చూశాను. ఇలాంటి సినిమా ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎన్ని సార్లు చూస్తామో లెక్కే లేదు. అలాంటి సినిమాని మళ్ళీ చూసి విజయం చేయాలి’’ అని కోరారు.

Also Read:  Transport Business: బెస్ట్.. ఎవర్ గ్రీన్ బిజినెస్ ఐడియా : ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 4K technology
  • Alluri Sitaramaraju
  • cheater
  • cowboy movies
  • Entertainment
  • experiments.
  • fans
  • Krishna Gari
  • Mosagallaku Mosagadu
  • movie industry
  • re-releasing
  • success
  • Telugu Cinema
  • theater experience
  • tollywood
  • trendsetter
  • tribute

Related News

Koratala Siva Balakrishna Combination

బాలయ్య – కొరటాల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్

Balayya–Koratala నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తున్నారు. అరవై ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య, తన తదుపరి చిత్రం కోసం స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు పూర్

  • Papam Prathap Movie Review

    Thiruveer Papam Prathap: పాపం ప్రతాప్ మూవీ రివ్యూ

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

  • Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

    Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

  • Pawan Kalyan Marriage Danah Marks ?

    Anna Konidela: తీన్మార్ ఫంక్షన్ లో పవర్ పక్కన ఉన్నది.? ఆమె నేను కాదు : అన్నా కొణిదెల షాకింగ్ కామెంట్స్

Latest News

  • Sachin Tendulkar : నేడు దంతెవాడకు సచిన్ .. కారణం ఇదేనా!

  • ఐపీఎల్ 2026.. టాప్ ప్లేస్‌లో ఉన్న జ‌ట్టు ఏదీ?

  • RBI కీలక నిర్ణయం..బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్

  • IPL 2026: నేడు లక్నో vs రాజస్థాన్..గెలుపు ఎవర్ని వరిస్తుందో ?

  • RTC Strike : తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్..తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd