GodFather Box Office Collections: గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ కలెక్షన్లు.. 2 రోజుల్లో 70 కోట్ల షేర్!
తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకుంటోంది. హిందీ బెల్ట్ లోనూ దూసుకుపోతోంది.
- By Balu J Published Date - 02:42 PM, Sat - 8 October 22

తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. హిందీ బెల్ట్ లోనూ దూసుకుపోతోంది. 2 రోజుల్లో దాదాపు 70 కోట్ల రూపాయలను టచ్ చేయగలిగింది. మూడో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లను దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి, సత్యదేవ్, నయనతార ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రం మలయాళం చిత్రం లూసిఫర్‌కి తెలుగు రీమేక్. ఈ సందర్భంగా ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కాడెల్ మాట్లాడుతూ, “బుధవారం 19 కోట్ల నెట్ ఓపెనింగ్ తీసుకున్న తర్వాత, గాడ్ ఫాదర్ గురు, శుక్రవారాల్లో వరుసగా రూ. 12.5 కోట్లు, రూ. 8.70 కోట్లు వసూలు చేసింది.
ఈ చిత్రం శని, ఆదివారాల్లో ఎక్కువగా వసూలు సాధించే అవకాశం ఉంది. వచ్చే రెండు రోజుల్లో ఇండియా మొత్తం మీద ఈ సినిమా 20-25 కోట్ల రూపాయల వసూళ్లు రాబడుతుందని ఆశిస్తున్నాను. హిందీ బెల్ట్‌లో 600 స్క్రీన్స్ పెరిగాయి. అయితే చిరంజీవి స్టార్‌డమ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, సినిమా కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి” అని కేడెల్ చెప్పారు. చిరంజీవి చివరి చిత్రం ఆచార్య, అతని కుమారుడు, నటుడు రామ్ చరణ్ అతిధి పాత్రలో నటించినప్పటి మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కానీ గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ ను ప్రభావితం చేస్తోంది.