Divya Bharathi : సుడిగాలి సుధీర్ మౌనంపై ‘గోట్’ హీరోయిన్ ఆవేదన.. దర్శకుడి పై షాకింగ్ పోస్ట్
- By Vamsi Chowdary Korata Published Date - 03:05 PM, Wed - 19 November 25
సుడిగాలి సుధీర్, దివ్యభారతి నటించిన ‘గోట్’ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. దర్శకుడు నరేష్ కుప్పిలి, హీరోయిన్ దివ్యభారతి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ‘చిలక’ అంటూ దర్శకుడు చేసిన వ్యాఖ్యలపై దివ్యభారతి తీవ్రంగా స్పందించింది. మహిళలను కించపరిచేలా మాట్లాడారని, హీరో మౌనం కూడా తనను నిరాశపరిచిందని ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. ఈ వివాదంపై దర్శక హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.
సుడిగాలి సుధీర్, దివ్యభారతి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా గోట్ . రెండున్నరేళ్ల కిందటే ప్రారంభమైన ఈ చిత్రం.. ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ అంటూ హడావిడి చేశారు కానీ.. ఆ తర్వాత సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. షూటింగ్ ఎక్కడిదాకా వచ్చింది?, ఎప్పుడు రిలీజ్ చేస్తారు? వంటి విషయాల ఊసే లేదు. అయితే సుధీర్ హీరోగా ‘హైలెస్సో’ సినిమా సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత, ఉన్నట్టుండి ‘గోట్’ మూవీ వార్తల్లోకి వచ్చింది. త్వరలో విడుదల అంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు వెలిశాయి. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్, డైరెక్టర్ మధ్య ఓ వివాదం వెలుగులోకి వచ్చింది.
Calling women “Chilaka” or any other term isn’t a harmless joke, it’s a reflection of deep-rooted misogyny. And this wasn’t a one-off incident; this director followed the same pattern on set too, repeatedly disrespecting women and honestly, betraying the very art he claims to… pic.twitter.com/7mNGpcxeG0
— Divyabharathi (@divyabarti2801) November 19, 2025
బ్యాచిలర్ మూవీతో యూత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన తమిళ నటి దివ్యభారతి.. ‘గోట్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాకు పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకుడుగా ఉండేవాడు. కానీ ఇప్పుడు డైరెక్టర్ పేరు లేకుండానే నిర్మాతలు సినిమాని రిలీజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి దర్శక నిర్మాతల మధ్య విభేదాలు వచ్చాయనే విషయం స్పష్టమవుతోంది. ఈ సంగతి అటుంచితే ఇప్పుడు ‘గోట్’ మూవీ నుంచి ‘ఓడియమ్మ’ అనే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. దీని గురించి నరేష్ కుప్పిలి ఎక్స్ లోన్ పెట్టిన ఓ పోస్ట్ వివాదాస్పదంగా మారింది.
For those claiming I ‘always have issues’ with teams, facts matter.
I’ve worked repeatedly with the same team, actors and crews in Tamil cinema with zero conflicts.
Only this one director crossed lines and made disrespectful comments.
He chose to make it public, and I have every…— Divyabharathi (@divyabarti2801) November 19, 2025
ఇది ఏమి లేబర్ రా నువ్వు, ఎడిట్ లో తీసి పడేసిన షాట్స్ తో నెక్స్ట్ సినిమా అంతా గడిపేలా ఉన్నావ్?. అసలు సెకండ్ హీరోయిన్ చేయాల్సింది ఈ చిలకతో వదిలావ్. మంచి ట్యూన్ ని ఏమి చేసావ్ రా?. స్టెప్పమ్ కొట్టి డప్పమ్ వేయనా.. ఈ ఒక్క మాటతో రెండు చేతులు గుండుపై పెట్టుకొని.. అంటూ నరేష్ కుప్పిలి ట్వీట్ చేశాడు. అయితే ఇందులో తనని చిలక అని పిలవడంపై దివ్యభారతి తీవ్రంగా స్పందించింది. నరేష్ పోస్ట్ స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ.. మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నాడని, అతడు సెట్స్ లోనూ ఇదే విధంగా ప్రవర్తించేవాడని ఆరోపించింది.
స్త్రీలను చిలకా అని పిలవడం జోక్ కాదు. ఇది లోతుగా పాతుకుపోయిన స్త్రీ ద్వేషాన్ని ప్రతిబింబిస్తుంది. ఇదేమీ మొదటిసారి జరిగిన సంఘటన కాదు. ఈ దర్శకుడు సెట్లో కూడా అదే విధంగా మాట్లాడేవాడు. పదే పదే మహిళలను అగౌరవపరుస్తూ తాను క్రియేట్ చేస్తున్నానని చెప్పుకునే కళకే ద్రోహం చేశాడు. ఈ విషయంలో హీరో మౌనంగా ఉండటం చూసి నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను. ఈ సంస్కృతిని కొనసాగించడానికి అనుమతిస్తున్నాను. మహిళలను ఎగతాళి చేయకుండా గౌరవించే వర్క్ ప్లేస్ నే నేను ఎంచుకుంటాను. ఇది కేవలం ఒక ఎంపిక కాదు.. ఇది ఒక కళాకారిణిగా ఒక మహిళగా నా ప్రమాణం అని దివ్యభారతి పోస్ట్ చేశారు.
నాకు చిత్ర బృందాలతో ఎప్పుడూ ఏదొక సమస్యలు ఉంటాయి అని చెప్పుకునే వారికి, నేనొక నిజం చెప్పాలనుకుంటున్నా. నేను తమిళ చిత్ర పరిశ్రమలో ఒకే టీంతో ఎక్కువసార్లు పనిచేశాను. కానీ ఎటువంటి విభేదాలు లేవు. ఈ ఒక్క దర్శకుడు మాత్రమే హద్దులు దాటి కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. అతను దాన్ని పబ్లిక్ గా అన్నాడు కాబట్టి, ప్రతిస్పందించే హక్కు నాకు ఉంది. మీరు ఇప్పటికీ అలాంటి ప్రవర్తనను సమర్థించుకోవాలనుకుంటే, అది మీ ఇష్టం. నేను దాని గురించి పట్టించుకోను. ఎవరైనా నా గురించి చెడుగా మాట్లాడాలని అనుకుంటే నేను వారికి నిజంగా మంచి జరగాలని కోరుకుంటున్నాను అని దివ్య భారతి మరో పోస్ట్ పెట్టింది. మరి దీనిపై హీరో సుడిగాలి సుధీర్, డైరెక్టర్ నరేష్ కుప్పిలి ఎలా స్పందిస్తారో చూడాలి.