Pushpa 2: పుష్ప 2 లో గంగమ్మ తల్లి జాతర హైలేట్ గా నిలవనుందా
పుష్ప సినిమాలోని దాక్కో దాక్కో మేక అనే పాట ఉంది. ఆ పాటలో లైఫ్ కు సంబంధించిన ఫిలాసపీ ఉంటుంది. అలాగే అందులో గంగమ్మ తల్లి జాతర ప్రస్తావన ఉంటుంది. అయితే.. పుష్ప 1 లో గంగమ్మ జాతర చూపించలేదు
- By Praveen Aluthuru Published Date - 09:38 PM, Thu - 29 February 24
Pushpa 2: పుష్ప సినిమాలోని దాక్కో దాక్కో మేక అనే పాట ఉంది. ఆ పాటలో లైఫ్ కు సంబంధించిన ఫిలాసపీ ఉంటుంది. అలాగే అందులో గంగమ్మ తల్లి జాతర ప్రస్తావన ఉంటుంది. అయితే.. పుష్ప 1 లో గంగమ్మ జాతర చూపించలేదు. పుష్ప 2 లో మాత్రం గంగమ్మ జాతర చూపించబోతున్నారు. అయితే.. ఈ జాతర ఎపిసోడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో వస్తుందట. ఓ రేంజ్ లో ఉంటుందట.
ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసమే.. 35 రోజులు పని చేశారు. ఈ ఎపిసోడ్ కోసం ఏకంగా 50 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ ఎపిసోడ్ లో బన్నీ లుక్ చాలా బాగుందట. ఇంకా చెప్పాలంటే.. ఈ ఎపిసోడ్ అదిరింది అంటున్నారు. చేతులకు నెయిల్ పాలీష్, నదుట బొట్లు పెట్టుకుని అర్ధనారీశ్వర గెటప్ లో ఉన్న బన్నీ లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఇలా వచ్చిందో లేదో అలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ గెటప్ జాతరలో రివీల్ అవుతుంది. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అంటున్నారు. ఈ ఎపిసోడ్ కోసం సుకుమార్ చాలా హార్డ్ వర్క్ చేశారట.
ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కథ పై ఎప్పటి నుంచో కసరత్తు చేశారట. అది ప్రతి ఫేమ్ లో కనిపిస్తుందట. సౌత్ లో కంటే నార్త్ లో ఎక్కువుగా అంచనాలు ఉన్నాయి. ఈసారి పుష్ప రాజ్.. బాలీవుడ్ ను మరోసారి షేక్ చేస్తాడని గట్టిగా నమ్ముతున్నారు. 1000 కోట్లు కలెక్షన్ తగ్గేదేలే అనే ఇప్పటి నుంచే టాక్ వినిపిస్తోంది. ఆగష్టు 15న పుష్ప 2 థియేటర్స్ లోకి రావడం అని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా బాగా వస్తుందనే నమ్మకంతోనే సుకుమార్ పుష్ప 3 కూడా చేయాలని ఫిక్స్ అయ్యారట. దీనిని బట్టి ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
Also Read: Andhraratna Bhavan : మళ్లీల బిజీబిజీగా మారిన ఆంధ్రరత్న భవన్..!
Related News
Allu Arjun : అల్లు అర్జున్ విషయంపై.. పిఠాపురం వర్మ కామెంట్స్.. తప్పు చేసిన వారికి..
అల్లు అర్జున్, నాగబాబు విషయంపై పిఠాపురం టీడీపీ నేత వర్మ స్పందించారు. రీసెంట్ ఇంటర్వ్యూలో దీనికి గురించి ఆయన మాట్లాడుతూ..