Game Changer : దసరా కు మెగా సర్ప్రైజ్ లేనట్లేనా..?
ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ”గేమ్ ఛేంజర్” మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు
- By Sudheer Published Date - 08:46 AM, Sun - 22 October 23

ఏదైనా పెద్ద పండగ వస్తుందంటే చాలు అందరి హీరోల అభిమానులు..తమ హీరోల తాలూకా కొత్త సినిమాల అప్డేట్స్ ఏమొస్తాయో..? అని ఎదురుచూస్తుంటారు. ఇక ఇప్పుడు దసరా (Dasara) సందర్బంగా ప్రతి ఒక్కరు అలాగే ఎదురుచూస్తున్నారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)అభిమానులకు మాత్రం ఈ పండగ నిరాశకు గురి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ”గేమ్ ఛేంజర్” (Game Changer) మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ శంకర్ (Shankar) ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ కాస్త కోపంగా ఉన్నారు. అయితే ఈ దసరా కానుకగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నట్లు గత కొద్దీ రోజులుగా వార్తలు వినిపిస్తుడడం తో అంత ఆ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కు మరోసారి నిరాశే ఎదురైనట్లు తెలుస్తుంది. ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ పై మెగా కాంపౌండ్ నుంచి వస్తున్నా వార్తల ప్రకారం ఈ సినిమా నుండి దసరా కానుకగా సాంగ్ ను రిలీజ్ చేయడం లేదట.. ప్రస్తుతం చిత్ర యూనిట్ తమ ప్లాన్స్ అన్ని నిలిపి వేశారని దీంతో ఈ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇప్పట్లో ఇచ్చే ఆలోచనలో కూడా మేకర్స్ లేనట్టు సమాచారం. అయితే ఈ వార్త అభిమానుల్లో మరింత ఆగ్రహం నింపుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదని..దసరా సందర్బంగా అయినా అప్డేట్ వస్తుందని ఎదురుచూస్తుంటే..దసరా కు కూడా రావడం లేదనేది తట్టుకోలేకపోతున్నారు. ఇక ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా..కియారా హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకాంత్ , అంజలి తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
Read Also : Whats Today : 55 మందితో బీజేపీ ఫస్ట్ లిస్టు.. వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో ఇండియా ఢీ