Whats Today : 55 మందితో బీజేపీ ఫస్ట్ లిస్టు.. వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో ఇండియా ఢీ
Whats Today : నేడు సద్దుల బతుకమ్మ వేడుకలు.. హైదరాబాద్ లో ట్యాంక్‌బండ్‌పై వేడుకలకు ఏర్పాట్లు చేశారు.
- By Pasha Published Date - 08:32 AM, Sun - 22 October 23

Whats Today : నేడు సద్దుల బతుకమ్మ వేడుకలు.. హైదరాబాద్ లో ట్యాంక్‌బండ్‌పై వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకూ ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
We’re now on WhatsApp. Click to Join.
- 55 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్టు సిద్ధమైంది. ఆదివారం ఈ జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
- వన్డే వరల్డ్ కప్‌లో ఇవాళ న్యూజిలాండ్ తో ఇండియా మ్యాచ్ జరుగనుంది. ధర్మశాలలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. అది ఈరోజు సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు కోస్తాలో వానలు కురిసే ఛాన్స్ ఉంది.
- తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ ఈరోజు స్వర్ణ రథంపై మలయప్పస్వామి విహరించనున్నారు. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై శ్రీవారు దర్శనమిస్తారు.
- ఇంద్రకీలాద్రిపై 8వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనం (Whats Today) ఇస్తున్నారు.