Tillu Square: ఏంటి.. టిల్లు స్క్వేర్ సినిమాకు ఏకంగా అంతమంది డైరెక్టర్లు వర్క్ చేసారా!
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతోపాటు ఓవర్ నైట్ లోనే
- By Anshu Published Date - 11:07 PM, Mon - 18 March 24

టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతోపాటు ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ ను అందుకున్నారు సిద్దూ. ఇదిలా ఉంటే డీజే టిల్లు కీ సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. అయితే ఈ సినిమాను మర్చి 18న విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినప్పటికీ, మళ్లీ విడుదల తేదీని మారుస్తూ ఈ నెల 29న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్స్, ఓ సాంగ్ రిలీజ్ అయి సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమాలో డీజే టిల్లులో నటించిన నేహశెట్టి కాకుండా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటివరకు చాలా పద్ధతిగా నటించిన అనుపమ ఈ సినిమా కోసం ఆ హద్దులు అన్ని చెరిపేస్తూ సిద్దూతో పుల్ గా రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఇప్పటికే విడుదలైన టీజర్లు పోస్టర్లు చూస్తే ఈపాటికి అర్థం అయ్యే ఉంటుంది. అయితే ఈ సినిమాకు ఒకరు ఇద్దరు కాదు ఏకంగా అయిదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసినట్లు తెలు స్తోంది. డీజే టిల్లు సినిమాకు కూడా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసారు.
శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల సాంగ్స్ కి మ్యూజిక్ ఇస్తే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఆ సినిమాలో సాంగ్స్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా 5 గురితో ఈ సినిమాకి మ్యూజిక్ అందించారట. శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల, అచ్చు రాజమణి ఈ ముగ్గురు సంగీత దర్శకులు పాటలకు సంగీతం అందిస్తుంటే, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అయితే కొత్తగా భీమ్స్ సిసిరోలియో కూడా ఈ సినిమాకి కొంత బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో మొత్తం ఈ సినిమాకు అయిదుగురు సంగీత్ దర్శకులు పనిచేయడం విశేషం. ఒక చిన్న సినిమాకు, మీడియం రేంజ్ హీరో సినిమాకు అయిదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టే. మరి డీజే టిల్లు హిట్ అయినట్టు టీలు స్క్వేర్ కూడా ఆ రేంజ్ హిట్ అవుతుందా చూడాలి మరి.