Sankranti Movies: సంక్రాంతి సినిమాల పంచాయితీ.. ఎవ్వరు తగ్గడం లేదుగా
తెలుగు రాష్ట్రాల్లో సినిమా సందడి సంక్రాంతికి కనిపిస్తుంది. ఈ సారి మారి ఎప్పుడూ లేని విధంగా ఐదు స్ట్రైయిట్ సినిమాలు విధులకు సిద్ధమవుతున్నాయి. నాగార్జున నా సామి రంగ, వెంకటేష్ సైంధవ్, మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, తేజ సజ్జ హనుమాన్.
- By Praveen Aluthuru Published Date - 05:39 PM, Sun - 24 December 23
Sankranti Movies: తెలుగు రాష్ట్రాల్లో సినిమా సందడి సంక్రాంతికి కనిపిస్తుంది. సంక్రాంతికి ఎలాగైనా విడుదల చేయాలనీ మేకర్స్ యమస్పీడుగా తెరకెక్కిస్తుంటారు. అయితే ఈ సారి మారి ఎప్పుడూ లేని విధంగా ఐదు స్ట్రైయిట్ సినిమాలు విధులకు సిద్ధమవుతున్నాయి. నాగార్జున నా సామి రంగ, వెంకటేష్ సైంధవ్, మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, తేజ సజ్జ హనుమాన్.
సంక్రాంతి సందర్భంగా విడుదలకు పై ఐదు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం అంటూ ప్రమోషన్స్ లో దూసుకెళుతున్నారు. ఐదు సినిమాలు రిలీజ్ అయితే.. థియేటర్లు దొరకడం కష్టం. అయితే.. ఈ ఐదు సినిమాల్లో నాలుగు సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాయి కానీ.. ఐదవ సినిమా నా సామి రంగ మాత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. దీంతో నా సామి రంగ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
సంక్రాంతి సినిమాల నిర్మాతలు రిలీజ్ విషయంలో తగ్గకపోవడంతో ఈ పంచాయితీ ఛాంబర్ కు చేరింది. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో మేము ముందుగానే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని చెప్పామని.. అందరూ చెప్పారట. ఈ మీటింగ్ కు హనుమాన్ ప్రొడ్యూసర్ హాజరు కాకపోవడంతో దిల్ రాజు సీరియస్ అయ్యారట. దీంతో ఈ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదట. నెక్ట్స్ వీక్ మరోసారి మీటింగ్ పెట్టుకుని ఏం చేయాలనే విషయం పై సరైన నిర్ణయం తీసుకుందామని దిల్ రాజు చెప్పారట.
ఈ నెల 25కి నా సామి రంగ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుందట. ఈ షూట్ తో షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి ప్రమోషన్స్ లో స్పీడు పెంచాలని డిసైడ్ అయ్యారట. ఎన్ని థియేటర్లు దొరికితే అన్ని థియేటర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేయమని.. ఖచ్చితంగా సంక్రాంతికి థియేటర్లో నా సామి రంగ సినిమా ఉండాలని నాగార్జున నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ కు చెప్పారట. దీంతో థియేటర్లు ఎన్ని దొరుకుతాయి అనేది ఆసక్తిగా మారింది. త్వరలోనే సంక్రాంతి సినిమాల రిలీజ్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Also Read: Rashmika Boyfriend: రివీల్ అయిన రష్మిక బాయ్ ఫ్రెండ్
Related News
Mirai Manchu Manoj : మిరాయ్ నుంచి మంచు హీరో లుక్.. ప్రీ లుక్ పోస్టర్ షేక్ అయ్యేలా ఉంటే..!
Mirai Manchu Manoj హనుమాన్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న తేజా సజ్జా లీడ్ రోల్ లో ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న సినిమా మిరాయ్.