Rashmika Boyfriend: రివీల్ అయిన రష్మిక బాయ్ ఫ్రెండ్
రష్మిక.. ఛలో, దేవదాస్, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు.. ఇలా బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించి అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.
- Author : Praveen Aluthuru
Date : 24-12-2023 - 3:38 IST
Published By : Hashtagu Telugu Desk
Rashmika Boyfriend: చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాడు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. చిలసౌ తర్వాత నాగార్జునతో మన్మధుడు 2 తీశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆతర్వాత గత కొంతకాలంగా నెక్ట్స్ మూవీ స్టోరీ పై కసరత్తు చేసి ఫైనల్ గా ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఇందులో రష్మిక నటిస్తుండడం విశేషం.
రష్మిక.. ఛలో, దేవదాస్, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు.. ఇలా బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించి అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా సక్సెస్ సాధించింది. రీసెంట్ గా యానిమల్ మూవీలో పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పింది. దీంతో రష్మిక పేరు బాలీవుడ్ లో కూడా మారుమ్రోగుతోంది. అయితే.. ఈ అమ్మడు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
గర్ల్ ఫ్రెండ్ టైటిల్ తో రష్మిక నటిస్తోంది బాగానే ఉంది మరి.. బాయ్ ఫ్రెండ్ ఎవరు అనేది ప్రకటించలేదు. దీంతో ఈ సినిమాలో రష్మిక బాయ్ ఫ్రెండ్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. రష్మిక గర్ల్ ఫ్రెండ్ అయితే.. ఆమె బాయ్ ఫ్రెండ్ ఇతనే అంటూ దీక్షిత్ శెట్టిని పరిచయం చేశారు. ఇంతకీ ఎవరా దీక్షిత్ శెట్టి అనుకుంటున్నారా..? దియా అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆతర్వాత దసరా సినిమాతో సూరిగాడులా తెలుగు ప్రేక్షకుల దగ్గరయ్యాడు. దసరా మూవీలో నానితో పోటీపడుతూ నటించి మెప్పించాడు. ఇప్పుడు రష్మికతో కలిసి నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు.
గర్ల్ ఫ్రెండ్ కు తగిన బాయ్ ఫ్రెండ్ విక్రమ్ ఇతనే అంటూ మేకర్స్ దీక్షిత్ శెట్టికి సంబంధించిన స్పెషల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రష్మిక తన బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతుండడం.. విక్రమ్ ఏమో ఎగ్రసివ్ గా కనిపించడం చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read: Shock in Chennai: చెన్నైలో దారుణం.. ఐటీ ఉద్యోగిని దహనం