Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌తో పాటు ఈ ఫోటోలో ఉన్న పిల్లోడు ఎవరో గుర్తు పట్టారా..?
సినిమాలోకి రాకముందు ఇంటి వద్దే ఉన్న పవన్‌కి ఒక పెద్ద డ్యూటీ ఉండేది. అన్నయ్యలు, అక్కల పిల్లలని చూసుకుంటూ, వాళ్ళని ఆడిస్తూ ఉండడం.
- Author : News Desk
Date : 28-07-2023 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఇప్పుడంటే సినిమాలు, రాజకీయాలు అంటూ టైం లేకుండా బిజీ బిజీగా ఉంటున్నాడు. అయితే సినిమాలోకి రాకముందు ఇంటి వద్దే ఉన్న పవన్‌కి ఒక పెద్ద డ్యూటీ ఉండేది. అన్నయ్యలు, అక్కల పిల్లలని చూసుకుంటూ, వాళ్ళని ఆడిస్తూ ఉండడం. ఈ డ్యూటీ వల్లే తన టీనేజ్ అంతా వృధా అయ్యిపోయిందని పవన్ అప్పుడప్పుడూ చెప్పుకొస్తుంటాడు. మరి ఈ డ్యూటీలో భాగంగానే పవన్.. పైన కనిపిస్తున్న ఫొటోలో ఏ మెగా వారసుడిని ఆడిస్తున్నాడో గుర్తు పట్టారో.
ఆ ఫొటోలో కనిపించే బుడ్డోడు.. పవన్ ని విపరీతంగా అభిమానిస్తుంటాడు. పవన్ అభిమానిగా తనదే మొదటి స్థానం అని చెబుతుంటాడు. ఇంకా గుర్తుపట్టలేదా.. ఆ పిల్లోడు ఎవరో కాదు మన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej). తాజాగా ఈ మామ అల్లుళ్లు ఇద్దరు కలిసి ‘బ్రో'(Bro) సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకు రావడంతో తేజ్.. ఈ అరుదైన ఫోటోని షేర్ చేసి తన కల నెరవేరిందని తెలియజేశాడు. పవన్ తో కలిసి నటించిన ప్రతి రోజు తనకి జీవితాంతం గుర్తుండిపోతుందని వెల్లడించాడు. ఇక ఈ ఫొటోలో టీనేజ్ పవన్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.
కాగా పవన్ అండ్ తేజ్ మధ్య చాలా మంచి బాండింగ్ ఉంటుంది. పవన్ తనని ఎంతలా ప్రేమిస్తాడో ఇటీవల తన మాటలోనే చెప్పాడు. సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ అయిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఆ సమయంలో తేజ్ పరిస్థితి చూసి.. ఒక మూలాన కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నానని, తనని బ్రతికించమని ఆ దేవుడిని మనసులోనే కన్నీళ్లు పెట్టుకొని వేడుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ మాటలతోనే వీరిద్దరి మధ్య ఎలాంటి బంధం ఉందో అర్ధమవుతుంది.
Also Read : Bhairava Dweepam : పదిరోజుల పాటు భోజనం చేయకుండా.. రోజంతా మేకప్ తో బాలకృష్ణ.. అప్పటి భైరవద్వీపం విషయాలు..