#GetWellSoon : విశాల్ త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ పోస్టులు
#GetWellSoon : ఈ ఈవెంట్‌కు విశాల్ కూడా హాజరయ్యారు. ఐతే, విశాల్ బాగా బక్కచిక్కిపోయి, గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు
- By Sudheer Published Date - 10:13 PM, Mon - 6 January 25

తమిళ నటుడు విశాల్ (Actor Vishal) పరిస్థితి అభిమానులందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. నిన్న చెన్నైలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జరిగింది. ఈ ఈవెంట్‌కు విశాల్ కూడా హాజరయ్యారు. ఐతే, విశాల్ బాగా బక్కచిక్కిపోయి, గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. స్టేజీపై మాట్లాడుతున్న సమయంలో చేతులు కూడా వణుకుతూ కనిపించింది. కనీసం మైక్‌ను కూడా గట్టిగా పట్టుకోలేకపోతున్నాడు. అంతేకాదు.. మాట్లాడుతున్నపుడు నోట్లో నుంచి మాటలు కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు. ఆయనను ఆలా చూసిన అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై చర్చించుకుంటున్నారు. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే విశాల్ ఇలా అయిపోయాడేంటి అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. విశాల్ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు వివరించారు. ప్రస్తుతం ఆయన జ్వరంతో బాధపడుతున్నారని, పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని చెప్పారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో Get Well Soon Vishal అంటూ పోస్టులు చేస్తున్నారు.
విశాల్ అనారోగ్యానికి ప్రధాన కారణాలు పనివత్తిడి, నిరంతర ప్రోగ్రామ్స్, మదగదరాజ ప్రమోషన్లలో పాల్గొనడం వంటి కార్యకలాపాల వల్ల శారీరకంగా విపరీతంగా అలసట చెందడం అని అంటున్నారు. సడెన్‌గా అనారోగ్యం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని అభిమానులు అభ్యర్థిస్తున్నారు. అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తమ ప్రగాఢ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. “మేమంతా మీతో ఉన్నాం విశాల్ గారు, మీరు త్వరగా కోలుకోవాలి” అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేస్తున్నారు.
We wish you a speedy recovery to Vishal Sir!
Get well soon and back to inspiring us all. 💪 "#GetWellSoon #StayStrong#vishal pic.twitter.com/PULvzgXaKd— Gaja Thoogudeepa (@gaja_tweetz) January 6, 2025
Read Also :