HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Extraordinary Response To Bhale Bhale Banjara Song In Acharya

Acharya: ‘భలే భలే బంజారా’ కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్!

అని ఆచార్య, సిద్ధ హుషారుగా చిందేస్తున్నారు. అస‌లు వారికి అడ‌విలో ఏం ప‌ని..

  • Author : Balu J Date : 19-04-2022 - 11:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Banjara
Banjara

‘‘ సింబా రింబ సింబా రింబ సిరత పులుల సిందాట‌
సింబా రింబ సింబా రింబ స‌ర‌దా పులుల స‌య్యాట‌

సీమ‌లు దూర‌ని సిట్ట‌డ‌వికి సిరున‌వ్వొచ్చిందీ
నిప్పు కాక రేగింది.. డ‌ప్పు మోత మోగింది

కాకులు దూర‌ని కార‌డ‌విలో పండ‌గ పుట్టింది
గాలి గంతులాడింది.. నేల వంత పాడింది
సీక‌టంతా సిల్లుప‌డి ఎన్నెల‌య్యిందియాలా
అందినంత దండుకుందా ప‌ద త‌లో చేయ్యలా

భ‌లే భ‌లే బంజారా మ‌జా మందేరా రేయి క‌చేరీలో రెచ్చిపోదాం రా
భ‌లే భ‌లే బంజారా మ‌జా మందేరా రేయి క‌చేరీలో రెచ్చిపోదాం రా ’’

అని ఆచార్య, సిద్ధ హుషారుగా చిందేస్తున్నారు. అస‌లు వారికి అడ‌విలో ఏం ప‌ని.. వారిని చూసి ఆడ‌వి బిడ్డ‌లు ఎందుకు సంతోషంగా సంబ‌రాలు చేసుకుంటున్నారు. అనే విష‌యాలు తెలియాలంటే ‘ఆచార్య’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు. మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 విడుద‌ల చేస్తున్నారు. ఏప్రిల్ 23న ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్నారు.

చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తో చాలా బిజీగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఆచార్య సినిమా పోస్ట‌ర్స్ .. టీజ‌ర్‌.. ట్రైల‌ర్‌.. రెండు పాట‌ల‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా సోమ‌వారం రోజున చిత్ర యూనిట్ ‘భలే భలే బంజారా..’ అనే పాటను విడుదల చేశారు. పాటకు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది. మణిశర్మ సంగీత సారథ్యం వహించిన ఆచార్య సినిమాలోని ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. పాట వినసొంపుగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటోంది. ట్యూన్‌కి త‌గ్గ‌టు ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి.. మ‌రో వైపు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వేసిన స్టెప్స్ కొన్నింటిని ఈ సాంగ్‌లో చూడొచ్చు. ఇద్ద‌రు పోటీ ప‌డి డాన్సు చేసిన ఈ పాట థియేట‌ర్‌లో రేపు ప్ర‌భంజ‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • acharya latest updates
  • koratala siva
  • megastar chiranjeevi
  • ram charan

Related News

Peddi Special Song

‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన చిత్రాల్లో 'పెద్ది' ఒకటి. తాజా పరిణామాలతో ఈ ప్రాజెక్ట్ పట్ల క్యూరియాసిటీ మరింత పెరిగింది.

  • Chiranjeevi-director Bobby Mega 158 movie Negative Role Dimple Hayathi

    Mega 158 : మెగాస్టార్ సినిమాలో.. విలన్ గా డింపుల్ హయాతి?

Latest News

  • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

  • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

  • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

  • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

Trending News

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd