HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >English Pop Singer Ed Sheeran Comments About Rrr Movie

RRR : తగ్గేదేలే అంటున్న ఆర్ఆర్ఆర్.. జపాన్ లో ఇప్పటికే అదే క్రేజ్.. హాలీవుడ్ పాప్ సింగర్!

  • Author : Vamsi Chowdary Korata Date : 15-03-2024 - 11:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 15 Mar 2024 10 15 Am 224
Mixcollage 15 Mar 2024 10 15 Am 224

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతేకాకుండా కలెక్షన్ ల మోత మోగించింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల అయ్యి కోట్లలో కలెక్షన్స్ ను సాధించింది. కాగా సినిమా విడుదల అయ్యి రెండేళ్లు గడిచిపోయింది. అయినా సరే ఈ సినిమా సృష్టించిన మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. అది కూడా టాలీవుడ్ లో కాదు, హాలీవుడ్ లోనే ఎక్కువ వినిపిస్తోంది.

మొన్న ఈ మధ్య జరిగిన ఒక అవార్డుల వేడుకల్లో ఈ సినిమా గురించి జేమ్స్ కామెరాన్ మాట్లాడం, ఆ తరువాత పాకిస్తాన్ మీడియాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ గురించి మాట్లాడం చూసాము. అలాగే ఇటీవల ఆస్కార్ వేదిక పై మరోసారి ఆర్ఆర్ఆర్ కనిపించి టాలీవుడ్ ఆడియన్స్ ని ఫుల్ ఖుషి చేసింది. ఇప్పుడు తాజాగా ఒక హాలీవుడ్ పాప్ సింగర్ ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ.. అద్భుతమైన ఫిలిం అని చెప్పుకొచ్చారు. హాలీవుడ్ పాప్ రంగంలో వన్ ఆఫ్ ది టాప్ సింగర్ గా రాణిస్తున్న ఎడ్ షీరన్ ప్రస్తుతం కొన్నిరోజుల నుంచి బాలీవుడ్ లో సందడి చేస్తున్నారు.

 

Do you know Naatu?

Yay, @edsheeran knows more than naatu..😉

@BrutIndia #RRRMovie pic.twitter.com/MTEeAdp1Oh

— RRR Movie (@RRRMovie) March 14, 2024

ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్స్ తో కలిసి డాన్స్ వేయడం, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎడ్ షీరన్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్స్ తో కలిసి నేను ఆర్ఆర్ఆర్ సినిమా చూసాను. అది చాలా అద్భుతమైన సినిమా. టెక్నికల్ గా ప్రతి విషయంలో ఆ సినిమా నన్ను ఆకట్టుకుంది. ముఖ్యంగా నాటు నాటుకి వేసిన డాన్స్ అద్భుతం అని చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ టీం కూడా ఈ వీడియోని రీ ట్వీట్ చేస్తూ షేర్ చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hollywood
  • ntr
  • rajamouli
  • ram charan
  • rrr

Related News

Rajamouli Varanasi

Vaaranasi : టీం కు సమ్మర్ సెలవులు ఇచ్చిన రాజమౌళి..!!

షూటింగ్ సెట్‌లో క్రమశిక్షణకు, పర్ఫెక్షన్‌కు మారుపేరైన రాజమౌళి (జక్కన్న), తన టీమ్ విషయంలో తీసుకున్న తాజా నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో మహేష్ బాబుపై ఒక కీలకమైన సాంగ్ షూట్ జరుగుతోంది

    Latest News

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • WB Polling : పశ్చిమ బెంగాల్ పోలింగ్ లో ఉద్రిక్తత

    • సీఎస్కే బౌల‌ర్ ఇంట విషాదం!

    • డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విండ్‌షీల్డ్ పగిలితే ఏం చేయాలి?

    • బాబా వంగా భవిష్యవాణి.. నిప్పుల కొలిమిలా మారనున్న భూమి!

    Trending News

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

      • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd